తమిళనాడులో స్కూళ్లు ఇప్పట్లో తెరచుకోవు…!

స్కూళ్లను ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేదని తమిళనాడు సర్కార్‌ స్పష్టం చేసింది.. నిజానికి ఈ సోమవారం నుంచి పాఠశాలలు తెర్చుకోవాలి..

తమిళనాడులో స్కూళ్లు ఇప్పట్లో తెరచుకోవు...!
Follow us

|

Updated on: Nov 12, 2020 | 2:38 PM

స్కూళ్లను ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేదని తమిళనాడు సర్కార్‌ స్పష్టం చేసింది.. నిజానికి ఈ సోమవారం నుంచి పాఠశాలలు తెర్చుకోవాలి.. తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లను, స్కూళ్లలోని హాస్టళ్లను ఓపెన్‌ చేయాలని ప్రభుత్వం అనుకుంది.. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.. స్కూళ్లను ఇప్పట్లో తెరవబోమంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఎప్పుడు తెరుస్తామనే విషయాన్ని త్వరలో చెబుతామన్నారు. కరోనా పరిస్థితులను అంచనా వేసుకున్న తర్వాతే పాఠశాలలను తెరుస్తామన్నారు ముఖ్యమంత్రి. అయితే చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులు, రిసర్చ్‌ స్కాలర్లకు మినహాయింపు ఉందని తెలిపారు. కాలేజీలు, హాస్ట‌ళ్ల‌ ప్రారంభంపై యూజీసీ నిబంధ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని పళనిస్వామి సూచించారు.