తెలంగాణలో ‘ఆ‘ కేసుల జోరు

తెలంగాణలో అవినీతి కేసులు జోరుమీదున్నాయి. గత సంవత్సరం 2018తో పోలిస్తే రాష్ట్రంలో అవినీతి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019లో మొత్తం 175 కేసులను యాంటి కరప్షన్ బ్యూరో నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగింది. 2018లో తెలంగాణ వ్యాప్తంగా 139 అవినీతి కేసులనో ఏసీబీ నమోదు చేయగా.. 2019లో ఈ సంఖ్య 175కు చేరింది. 2019లో నమోదైన ఏసీబీ కేసుల సంఖ్యను పరిశీలిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో అత్యధికంగా 54 కేసులు నమోదయ్యాయి. […]

తెలంగాణలో ‘ఆ‘ కేసుల జోరు
Follow us

|

Updated on: Dec 28, 2019 | 12:38 PM

తెలంగాణలో అవినీతి కేసులు జోరుమీదున్నాయి. గత సంవత్సరం 2018తో పోలిస్తే రాష్ట్రంలో అవినీతి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019లో మొత్తం 175 కేసులను యాంటి కరప్షన్ బ్యూరో నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగింది. 2018లో తెలంగాణ వ్యాప్తంగా 139 అవినీతి కేసులనో ఏసీబీ నమోదు చేయగా.. 2019లో ఈ సంఖ్య 175కు చేరింది.

2019లో నమోదైన ఏసీబీ కేసుల సంఖ్యను పరిశీలిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో అత్యధికంగా 54 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది రెవెన్యూ శాఖలో 37 అవినీతి కేసులు నమోదయితే ఈ ఏడాది అత్యధికంగా 54 కేసులు నమోదయ్యాయి. రెవెన్యూ శాఖ కి సంబంధించి 54 కేసులు, హోం డిపార్ట్మెంట్ 18 , మున్సిపల్ శాఖ 25 , పంచాయితీ రాజ్ 10 , విద్యుత్ శాఖకి చెందిన ఉద్యోగులపై 12 కేసులు నమోదయ్యాయి.

అవినీతి కేసుల్లో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో వుండగా.. 25 కేసులతో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ రెండో స్థానంలో వుంది. హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్‌లో 13, న్యాయ శాఖలో 5 , ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో 3, విద్యా శాఖలో 4, రోడ్డు రవాణా శాఖలో 3 కేసులను ఏసీబీ నమోదు చేసింది.