సౌత్ ఇండియన్ కళా “పద్మాలు”

డిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ పద్మ భూషణ్‌ అవార్డును అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కోవింద్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. 2001లో మోహన్‌లాల్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మోహన్‌లాల్‌ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. చిత్రపరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ […]

సౌత్ ఇండియన్ కళా పద్మాలు
Follow us

|

Updated on: Mar 11, 2019 | 1:21 PM

డిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ పద్మ భూషణ్‌ అవార్డును అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కోవింద్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. 2001లో మోహన్‌లాల్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మోహన్‌లాల్‌ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. చిత్రపరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ తాజాగా పద్మభూషణ్‌ అవార్డు వరించింది.

ఇక ఇండియన్ మైకెల్ జాక్సన్, నటుడు, దర్శకుడు..ఆల్‌రౌండర్ ప్రభుదేవాకు పద్మశ్రీ వరించింది. నాట్య రంగంలో తన అమోఘమైన ప్రతిభను కనబరిచినందుకుగానూ ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించింది.ప్రభుదేవా తన 25 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన డ్యాన్సింగ్‌ స్టయిల్స్‌ను చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. అంతేకాదు అతన్ని చూసి ఇన్‌స్పైర్ అయినవారు కూడా చాలా మందే ఉన్నారు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న ప్రభుదేవా దాదాపు 13 చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు.

వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ శంకర్ మహదేవన్ కూడా పద్మ శ్రీ సత్కారాన్ని అందుకున్నారు. నాలుగు సార్లు జాతీయ అవార్డులు అందుకున్న మహదేవన్ తన గాత్రంతో, కంపోజేషన్‌తో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు.