“జకీర్ నాయక్‌” కావాలని మోదీ అడగలేదట..!

Modi didn't ask me to return Zakir Naik.. says Malaysian PM Mahathir Mohamad, “జకీర్ నాయక్‌” కావాలని మోదీ అడగలేదట..!

వివాదాస్పద ఇస్లాం మత ప్రభోధకుడు జకీర్ నాయక్‌.. ఉగ్రవాద కార్యకలాపాల కేసులో నిందితుడే కాదు.. భారత్‌లో మనీలాండరింగ్ కేసులో కూడా నిందితుడే. అయితే అతడు ప్రస్తుతం దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే అతడు ప్రస్తుతం మలేషియాలో తలదాక్కున్న విషయం తెలిసిందే. గతంలో త్వరలో ఇంటర్ పోల్ అధికారులు అరెస్ట్ చేసి తీసుకురాబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా మలేషియా అతడిని అరెస్ట్ చేసి అప్పగిస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆ దేశ ప్రధాని డాక్టర్ మహతిర్ మొహమద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ జకీర్ నాయక్‌ను అప్పగించాలని ఏం కోరలేదని అన్నారు. ఇటీవల మోదీతో భేటీ అయ్యానని.. అప్పుడు జకీర్ అంశం గురించి ప్రస్తావించలేదని మలేషియా ప్రధాని అన్నారు.

అయితే జకీర్ మలేషియా దేశీయుడు కాదని.. ఆయన గత ప్రభుత్వం శాశ్వత హోదా మాత్రమే కల్పించిందని అన్నారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు జకీర్‌ సహకారం అందించారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. పీస్‌ టీవీ ద్వారా నిధులు సేకరించి వాటిని ఉగ్ర సంస్థలకు మళ్లించారన్న ఆరోపణల కింద ఎన్‌ఐఏ ఆయనపై కేసు నమోదు చేసింది. ఇప్పటికే భారత్‌లోని జకీర్ నాయక్ ఆస్తులను జప్తు చేశారు. అంతేకాదు పాస్‌పోర్టును కూడా రద్దు చేశారు. దీంతో మలేషియాకు పారిపోయి అక్కడే శాశ్వత నివాసం కోసం అనుమతులు పొందారు. అయితే గతంలో అతన్ని అప్పగించాలని భారత ప్రభుత్వం అనేక సార్లు మలేషియా అధికారుల్ని కోరింది. కానీ, ఆయనపై మలేషియా దేశంలో ఎలాంటి నేరారోపణలు లేకపోవడంతో అప్పగించలేమని మలేషియన్ అధికారులు తొలుత నిరాకరించారు. అయితే ఆ తర్వాత దేశ వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారంటూ జకీర్‌పై మలేషియాలోని పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో జకీర్ ప్రసంగాలపై విచారణ జరిపి.. ఆయన ప్రసంగాల్ని నిషేధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *