రెండు, మూడు రోజులపాటు.. తెలంగాణలో మోస్తరు వర్షాలు..

ఈసారి రుతుపవనాలు సరైన సమయానికే పలుకరించాయి. దేశమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరో రెండు, మూడు

రెండు, మూడు రోజులపాటు.. తెలంగాణలో మోస్తరు వర్షాలు..
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 6:29 PM

ఈసారి రుతుపవనాలు సరైన సమయానికే పలుకరించాయి. దేశమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరో రెండు, మూడు రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్, అసోంలో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో నేడు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమురంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..

Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..