తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

చార్మినార్ వద్ద తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో జరిగిన భోగి పండగ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 7:17 am, Wed, 13 January 21

MLC Kavitha to lead Bhogi celebrations : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. భోగి వేడుకల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో జరిగిన భోగి పండగ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత.. తెలుగు రాష్ట్రాల ప్రజలు భోగభాగ్యాలతో సుఖ:సంపాదనలతో అనందంగా ఉండాలని అకాంక్షించారు.

ఈ సందర్బంగా నిర్వహించిన సాంప్రదాయ కార్యక్రమాలు ఆకట్టుకుున్నాయి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలతో చార్మినార్ ప్రాంతం సందడిగా మారింది. భోగి అంటేనే మన జీవితాల్లో ఉన్న చెడు అంత భోగి మంటల్లో కాలి పోవాలని జరుపుకుంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరికీ కరోనా మహమ్మారి నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నానన్నారు. సంక్రాంతి అంటేనే సిరిసంపదలు ఇచ్చే పండగ..అందరి జీవితాల్లో సిరిసంపదలు సమృద్ధిగా రావాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Read Also… Pongal Effect: పల్లెకు బయలుదేరిన పట్నం వాసులు.. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. ప్రయాణికులతో కిటకిటలాడుతోన్న..