Breaking News
  • హైదరాబాద్‌: పాతబస్తీ ప్రజలు వరదల్లో బాగా నష్టపోయారు. వరదల్లో నష్టపోయిన ప్రతీ ఒక్కరికి న్యాయం చేస్తాం . 117 ఏళ్ల తర్వాత 29 సెం.మీ వర్ష పాతం నమోదైంది . 117 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో 15వేల మంది చనిపోయారు . భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి . సాలరే మిల్లత్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ నుంచి 33 వస్తువులను వరద బాధితులను ఇస్తున్నాం. ఇలాంటి సమయంలో విమర్శలు తగదు, అందరూ కలిసి సమస్యను పరిష్కరించాలి. ప్రభుత్వం అందించే రూ.10వేలు సాయం అభినందనీయం . ప్రభుత్వం వరద బాధితులకు మరింత సాయం అందించాలి . పార్టీ ఆదేశిస్తే బీహార్‌ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తా-అక్బరుద్దీన్‌ ఓవైసీ.
  • కూల్చివేతలు, కుట్రలు, అక్రమ అరెస్ట్‌లే లక్ష్యంగా జగన్‌ పాలన. విద్య కోసం కూడా ఇతరరాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోపణలు నిజమైతే నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం వికృత చేష్టలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. తిరుగుబాటు తప్పదు. -టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
  • నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంపై స్పందించిన మంత్రి కొడాలి నాని. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొన్ని నెలలు మాత్రమే ఉంటారు. తర్వాత రిటైరై హైదరాబాద్‌లో ఉంటారు-మంత్రి కొడాలి నాని. ప్రభుత్వానికి రమేష్‌కుమార్‌ కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో.. ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు-మంత్రి కొడాలి నాని. బీహార్‌ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు-కొడాలి నాని.
  • మహబూబాబాద్‌: దీక్షిత్ కిడ్నాప్‌, హత్య కేసులో తల్లి వసంత అనుమానాలు. దీక్షిత్‌ కేసులో మంద సాగర్‌తో పాటు మరో ముగ్గురి పాత్ర కూడా ఉంది. వారి నుంచి మాకు, మా చిన్న కుమారుడికి కూడా ప్రాణ హాని ఉంది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి.. లేదా కేసు సీబీఐకి అప్పగించాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే మరిన్ని నేరాలు పెరుగుతాయి. -దీక్షిత్‌ తల్లి వసంత.
  • అమరావతి: కృష్ణా బోర్డు పరిధిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు. స్పిల్‌వేలు, జలవిద్యుత్ కేంద్రాలు బోర్డు ఆధీనంలోకి తేవాలి. కాలువహెడ్ రెగ్యులేటర్లు, ఎత్తిపోతలపథకాలను బోర్డు పరిధిలోకి తేవాలి. నీటి విడుదల, నియంత్రణ అధికారులు.. బోర్డు పర్యవేక్షణలోనే విధులు నిర్వహించాలని ప్రతిపాదనలు.
  • ట్రాఫిక్‌ జరిమానాల పెంపుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినంగా ఉండాలని నిర్ణయించాం. అడ్డగోలుగా వాహనాలు నడిపేవారిపై చర్యలు తప్పవు-మంత్రి పేర్ని నాని. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా ఉండాలి-మంత్రి పేర్ని నాని. ఏపీ, తెలంగాణ చెక్‌పోస్టుల దగ్గర ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించాం-పేర్ని నాని. మంగళవారం ఒప్పందం చేసుకుంటామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెప్పారు. జూన్‌ 18 నుంచి టీఎస్‌ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. టీఎస్ అధికారులు ఏది చెబితే దానికి ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకా టీఎస్‌ అధికారులు ప్రతిపాదనలు ఇవ్వలేదు-పేర్ని నాని. మేము మొదటి నుంచి కూడా మొండిగా ప్రవర్తించలేదు. ఆర్టీసీ లాభనష్టాలను చూడడంలేదు.. ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ ఆర్టీసీకి సెలవుల కారణంగా ఒప్పందం చేసుకోలేకపోయాం.
  • గుంటూరు: తాడేపల్లిలోని రెండు ఫార్మసీ షాపుల్లో చోరీ, రూ.18 వేలు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన దుండగులు, పీఎస్‌లో ఫిర్యాదు.

వరద సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష, కీలక ఆదేశాలు

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

KT Rama Rao reviews flood situation in Hyderabad, వరద సహాయక చర్యలపై కేటీఆర్ సమీక్ష, కీలక ఆదేశాలు

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులు, మేయర్‌, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని సూచించారు. వరద బాధితులకు వైద్య సదుపాయంతో పాటు ఆహారం, దుప్పట్లు అందజేయాలని సూచించారు.

కేటీఆర్ ఆదేశాలు :

• జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశం

• మెడికల్ క్యాంపులు వెంటనే ఏర్పాటు చేయాలి. ఆ క్యాంపుల్లో ప్రస్తుతం బస్తి దావఖానలలో పనిచేస్తున్న డాక్టర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది అందరూ పాల్గొనాలని సూచన

• ప్రస్తుత భారీ వర్షాలకు పెద్దఎత్తున నగరంలో చెట్లు, విద్యుత్ పోల్స్ విరిగిపోయిన నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు జిహెచ్ఎంసి, విద్యుత్ సంస్థలతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచన

• హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండి, అక్కడి నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నుంచి ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచన

• హైదరాబాద్ నగర రోడ్ల పైన ప్రస్తుతం పేరుకుపోయిన నీటిని పంపించేందుకు ఓపెన్ చేసిన మ్యాన్‌హోల్స్ వంటి ప్రాంతాల్లో సురక్షిత చర్యలు తీసుకునేలా జలమండలికి ఆదేశం

• ఓపెన్ నాలల వద్ద ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు స్థానిక మున్సిపల్ కమిషనర్లు, క్షేత్ర సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఆదేశం

• వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ జీహెచ్‌ఎంసీ మరియు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందితో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలి

 

Also Read :

Breaking : కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య !

గ్రేటర్ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు

హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్‌: 3 రోజులు బయటకు రావొద్దు

Related Tags