sankranti Festival: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్..

Sankranti Festival: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు.

sankranti Festival: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 10:11 PM

Sankranti Festival: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు తెలుగునాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు గవర్నర్ హరిచందన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం.. ధాన్యసిరులు, సిరిసంపదలతో రైతులు జరుపుకునే సంక్రాంతి వేడుక తెలుగు వారి సంప్రదాయాలలో ముఖ్యమైన స్ధానాన్ని ఆక్రమించిందన్న ఆయన.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ వేళ తెలుగు లోగిళ్లు అలనాటి అనుభూతులకు వేదికలుగా మారుతాయన్నాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామ సీమలలో నెలకొనే సందడి అనర్వచనీయం అని అన్నారు. ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులాటలు, పతంగుల సందళ్ళు, భోగి మంటలు, పిండివంటలు, పశు ప్రదర్శనలు గ్రామాల్లో సంక్రాంతి శోభను మరింత పెంచుతాయన్నారు. సంక్రాంతి పండుగ మనందరిలో ప్రేమ, అప్యాయత, స్నేహం, సోదరభావం, మంచి ఆలోచనలను ప్రేరేపిస్తుందని అన్నారు.

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆక్షాంచారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం తెలుగువారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Also read:

Alludu Adhurs : మాస్ సాంగ్ తో అలరించిన ‘అల్లుడు అదుర్స్’.. డ్యాన్స్ తో అదరగొట్టిన మోనాల్..

Coronavirus: పది రోజుల్లోనే అధ్యక్ష ఎన్నికలు.. కరోనా బారిన పడిన దేశ అధ్యక్షుడు.. బహిరంగ సమావేశాలు రద్దు