Breaking News
  • నల్గొండ: ధర్మారెడ్డిపల్లి కాల్వను పూర్తిచేసి రైతులకు నీరు ఇవ్వాలి. రైతుల ఆత్మహత్యలలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తేనే సీఎం అని అనిపించుకుంటారు. రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • కరీంనగర్‌: అల్గునూర్‌ బ్రిడ్జి పైనుంచి పడ్డ కారు. కారులో ప్రయాణిస్తున్న భర్త మృతి, భార్యకు గాయాలు. కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌కు గాయాలు. మృతుడు కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు. కొమురవెళ్లి జాతరకు వెళ్తుండగా ఘటన.
  • సిద్దిపేట: జగదేవపూర్‌లో ఉద్రిక్తత. చైర్మన్‌ పదవి కోసం రెండువర్గాలుగా చీలిన టీఆర్‌ఎస్. ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న పోలీసులు.
  • చెన్నై: విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం. పొలాల్లో మల విసర్జన చేశాడని యువకుడిని కొట్టిన అగ్రవర్ణాల పెద్దలు. యువకుడికి తీవ్రగాయాలు, పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. గాయాలతో ఉన్న యువకుడిని ఇంటికి పంపిన పోలీసులు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే యువకుడు మృతి. కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆందోళన. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌.
  • బాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ దాడులపై రాజకీయ రచ్చ. వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు. ట్విట్టర్‌లో చంద్రబాబుపై విజయసాయి ధ్వజం. కౌంటర్‌ ఎటాక్‌ చేసిన టీడీపీ నేతలు. శ్రీనివాస్‌ కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీని డైరీలో రాసుకున్నాడు. దోచుకున్నవి, దొంగ లెక్కలను పర్‌ఫెక్ట్‌గా రికార్డ్‌ చేశాడు-విజయసాయి. దోపిడీదారులు నిప్పుకణికల్లా బిల్డప్‌ ఇస్తుంటారు-విజయసాయి. టీడీపీపై దుష్ప్రచారం చేస్తే చట్టపర చర్యలు-యనమల. ఐటీ దాడులను భూతద్దంలో చూపించారు-యనమల. రూ.2 వేల కోట్ల నగద అని ప్రచారం చేశారు. చంద్రబాబుకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి-యనమల. శ్రీనివాస్‌ ఇంట్లో వేల కోట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారు-బుచ్చయ్య. వైవీ సుబ్బారెడ్డి మైనింగ్‌లపై విచారణ చేయాలి-బుచ్చయ్య.

గూగుల్ మ్యాప్‌‌ని గుడ్డిగా నమ్మి.. గడ్డకట్టిన నదిలో పడ్డ యువకుడు!

Man falls into frozen Mississippi river, blames Google Maps, గూగుల్ మ్యాప్‌‌ని గుడ్డిగా నమ్మి.. గడ్డకట్టిన నదిలో పడ్డ యువకుడు!

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత జనాలు ‘బుర్ర’ ఉపయోగించడం మానేశారు. ఒకప్పుడు మెదడులో గుర్తుపెట్టుకొనే విషయాలను నేరుగా స్మార్ట్ ఫోన్లలో దాచుకుంటున్నారు. ‘గూగుల్’ సెర్చ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బద్దకం మరింత పెరిగిపోయింది. దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు.

అమెరికాలో ఓ చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మినియాపాలిస్‌లో ఓ యువకుడు నదికి అవతల ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్‌ను అనుసరించాడు. అది చూపించిన దారిలో నడుస్తూ నేరుగా గడ్డకట్టిన మిస్సిస్సిపీ నదిలోకి వెళ్లాడు. మంచు ముక్కలు కావడంతో నదిలో పాక్షికంగా మునిగిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు అతడిని రక్షించే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరిన రెస్క్యూ టీమ్ అతడిని రక్షించి హాస్పిటల్‌కు తరలించారు.

అయితే.. గూగుల్ మ్యాప్‌లో చూపించిన దారిలో నడవడం వల్లే తాను నదిలో చిక్కుకున్నానని బాధితుడు తెలిపాడు. వాస్తవానికి అతడు గమ్యం చేరాలంటే.. స్టోన్ ఆర్క్ బ్రిడ్జ్‌ను దాటాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా గూగుల్ అతడిని నదిని దాటి వెళ్లాలని చెప్పిందే గానీ, నదిలో నుంచి వెళ్లమని చెప్పలేదని.. అతడు పొరపాటును ఆ మార్గంలో వెళ్లి ఉంటాడని తెలుస్తోంది.

కాగా.. కొద్ది రోజుల కిందట గూగుల్ మ్యాప్‌ ని నమ్ముకుని విమానాశ్రయానికి వెళ్లేందుకు షార్ట్ కట్‌లో ప్రయాణిస్తూ కొందరు బురదలో చిక్కుకున్నారు. కాబట్టి.. టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు మన బుర్రను కూడా ఉపయోగించడం ఉత్తమం.