Breaking News
  • మెరుగుపడ్డ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం. ఐసీయూ నుంచి స్పెషల్‌ వార్డుకు తరలింపు. బోరిస్‌ మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యుల సూచన.
  • విశాఖ: జిల్లాలో కొనసాగుతున్న విజయసాయిరెడ్డి పర్యటన. నేడు ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ తరపున.. నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్న విజయసాయిరెడ్డి.
  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 34కు చేరిన కరోనా కేసులు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి. ఉమ్మడి జిల్లాలో 18 హాట్‌స్పాట్స్ గుర్తింపు.
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 30కు చేరిన కరోనా కేసులు. కరోనా బాధితులతో ప్రైమ్‌ కాంటాక్ట్ సంబంధించిన.. 112 మంది అనుమానితుల్లో 102 మందికి నెగెటివ్. పెండింగ్‌లో 10 మంది రిపోర్టులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్‌లో 268 మంది.
  • తిరుమల: ధన్వంతరి మహామంత్ర పారాయణం ప్రారంభించిన టీటీడీ. కరోనా వైరస్‌ నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు.. స్తోత్ర పారాయణం చేస్తున్న రుత్వికులు. హాజరైన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ అధికారులు.

10 రోజుల్లో పెళ్లనగా యువకుడు సూసైడ్..రీజన్ ఇదే..!

పది రోజుల్లో పెళ్లి..ఇళ్లంతా అప్పుడే సందడి..సందడిగా మారింది. బెంగుళూరులో ఉద్యోగం చేస్తోన్న వరుడు...ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేందుకు ఆఫీస్‌కు లీవ్ పెట్టి ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి రంగులు వేసే క్రమంలో సవతి తల్లితో జరిగిన వివాదంతో..మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. 
chittoor man suicide, 10 రోజుల్లో పెళ్లనగా యువకుడు సూసైడ్..రీజన్ ఇదే..!

పది రోజుల్లో పెళ్లి..ఇళ్లంతా అప్పుడే సందడి..సందడిగా మారింది. బెంగుళూరులో ఉద్యోగం చేస్తోన్న వరుడు…ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేందుకు ఆఫీస్‌కు లీవ్ పెట్టి ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి రంగులు వేసే క్రమంలో సవతి తల్లితో జరిగిన వివాదంతో..మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే..చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టి.వడ్డూరు గ్రామ మాజీ ఎంపీపీ వేమన్న మొదటి భార్య చనిపోవడంతో…రెండవ వివాహాం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు…రెండో భార్యకు ఒక కొడుకు ఉన్నారు. మొదటి భార్య పెద్ద కొడుకు చాలా ఏళ్ల క్రితం అనారోగ్యంతో కాలం చేయగా, రెండో కొడుకు యోగేష్‌(29 బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా మొదటి భార్య రెండో కుమారుడికి వివాహాం చేయాలని నిశ్చయించిన తండ్రి..ఇటీవలే కోట మండలం తోటకనుమ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి ఖరారు చేశాడు. పెళ్లి పనుల్లో భాగంగా..ఈ నెల 20 న ఇంటికి రంగులు వేసే క్రమంలో యోగేష్‌కు, సవతి తల్లికి మధ్య గొడవ జరిగింది. ఆమె కొంత ఘాటు పదజాలం ఉపయోగించడంతో..అప్పటికప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు యోగేశ్. అప్పటినుంచి అతడి ఆచూకి దొరకలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది.

ఆదివారం పెంగుగుంట అటవీ ప్రాంతంలో యోగేష్‌ బైక్ ఉన్నట్లు..అటువైపు వెళ్లినవారు చెప్పడంతో.. కుటుంబసభ్యులు వెళ్లి చూడగా యోగేష్ విగతజీవిగా కనిపించాడు. పక్కనే బీరు సీసాతో పాటు విష గుళికలు ఉండటంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహానన్ని పలమనేరు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.

 

Related Tags