జైళ్లలోనూ కరోనా విశ్వరూపం…363 మందికి పాజిటివ్

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెంట్టింపు స్థాయిలో నమోదుకావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వైద్యులు, పోలీసులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండగా, ఇప్పుడు జైళ్లలోని అధికారులు, సిబ్బంది, జైలు ఖైదీలు కూడా కరోనాతో పోరాడాల్సి వస్తోంది..

జైళ్లలోనూ కరోనా విశ్వరూపం...363 మందికి పాజిటివ్
Follow us

|

Updated on: Jul 02, 2020 | 1:29 PM

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెంట్టింపు స్థాయిలో నమోదుకావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే దేశంలో దాదాపు 4 లక్షల కేసులు(3,94,958) మోదైనట్లు తెలుస్తోంది. ఈ లెక్కలను బట్టి చూస్తుంటే రానున్న రెండు, మూడు నెలల్లో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువ రికవరీ రేటు పెరుగుతున్నా.. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా ఫ్రంట్ వారియర్స్‌గా పనిచేస్తున్న వైద్యులు, పోలీసులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండగా, ఇప్పుడు జైళ్లలోని సిబ్బంది, అధికారులు,  జైలు ఖైదీలు కూడా కరోనాతో పోరాడాల్సి వస్తోంది.

దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర ముందువరుసలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, మహారాష్ట్రలోని జైళ్లలో 363 మంది ఖైదీలు, 102మంది జైలు అధికారులు కూడా కరోనా బారినపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని జైళ్లలో నలుగురు ఖైదీలు కరోనా వల్ల మరణించినట్లు తెలిపారు. జైళ్లలో ఖైదీలకు కరోనా సోకడంతో పలు జైళ్లలో కలకలం రేపింది. దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలోని సెంట్రల్ జైలులో అత్యధికంగా 181 మంది ఖైదీలు, 44 మంది జైలు సిబ్బందికి కోవిడ్ సోకింది. పలు జైళ్లలో 255 మంది ఖైదీలు, 82 మంది జైలు ఉద్యోగులు వైరస్ బారి నుంచి కోలుకున్నారని మహారాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు వెల్లడించారు.

ముంబైతో పాటు థానే సెంట్రల్ జైలు, తలోజా కేంద్ర కారాగారం, బైకుల్లా జిల్లా జైలు, ఔరంగాబాద్ సెంట్రల్ జైలు, సతారా జిల్లాజైలు, ఎరవాడ సెంట్రల్ జైలు, థూలే జిల్లా జైలు, షోలాపూర్, రత్నగిరి, అకోలా జైళ్లలో ఖైదీలకు కోవిడ్ సోకినట్లు మహారాష్ట్ర జైళ్ల శాఖ పేర్కొంది. మరోవైపు మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,80,298కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 79,075 కాగా.. 93,154 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 8053కు చేరింది.

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్