మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ మంత్రి ఉషాఠాకూర్

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఉషా ఠాకూర్ మదర్సాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులందరూ మదర్సాల్లో పెరుగుతున్నారని, మదర్సాలకు ప్రభుత్వ నిధులను నిలిపివేయాలని పిలుపునిచ్చారు.

  • Balaraju Goud
  • Publish Date - 7:48 pm, Wed, 21 October 20

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఉషా ఠాకూర్ మదర్సాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులందరూ మదర్సాల్లో పెరుగుతున్నారని, మదర్సాలకు ప్రభుత్వ నిధులను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులందరూ మదర్సాల్లో పెరిగారని, ఉగ్రవాదులు జమ్మూ, కశ్మీరును టెర్రర్ ఫ్యాక్టరీగా మార్చారని ఆరోపించారు. జాతీయతకు అనుగుణంగా మదర్సాలు లేవన్న ఆమె.. సమాజం పురోగతికి వాటిని ప్రస్తుత విద్యావ్యవస్థలో విలీనం చేయాలన్నారు.

ఇండోర్‌లో మాట్లాడిన మంత్రి ఉషా..ఈ మదర్సాల్లో రాడికల్స్‌, ఉగ్రవాదులు అందరూ చదువుకున్నారన్నారు.
ఆమె ప్రకటనకు మద్దతుగా మదర్సాలను మూసివేస్తున్నట్లు అస్సాం ఇటీవల చేసిన ప్రకటనను బిజెపి శాసనసభ్యుడు సమర్ధించారు ప్రజల డబ్బుతో మత విద్యను బోధించడానికి అనుమతించలేనందున ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మదర్సాలు, సంస్కృత పాఠశాలలను మూసివేస్తుందని అక్టోబర్ 9 న అస్సాం విద్య, ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం నవంబర్‌లో అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని మంత్రి చెప్పారు.

ఇదిలావుంటే, మంత్రి ఉషా ఠాకూర్ గతంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విమర్శలు ఎదుర్కొన్నారు. 2019, మే నెలలో ఠాకూర్ మహాత్మా గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సేను “జాతీయవాది” అని పిలిచిన వివాదాలకు ఎక్కారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.