అంత‌రించిపోయింద‌నుకున్న పాము.. 129 ఏళ్ల తర్వాత కనిపించింది

ఆ పాము అంత‌రించిపోయింది. వంద సంవ‌త్స‌రాల దాటిన ఇంత‌వ‌ర‌కు దాని జాడ క‌నిపించ‌లేదు. అయితే అనూహ్యంగా ఆ జాతి పాము అసోంలో కనిపించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇండియా సైంటిస్టులను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అంత‌రించిపోయింద‌నుకున్న పాము.. 129 ఏళ్ల తర్వాత కనిపించింది
Follow us

|

Updated on: Jun 29, 2020 | 7:10 PM

ఆ పాము అంత‌రించిపోయింది. వంద సంవ‌త్స‌రాల దాటిన ఇంత‌వ‌ర‌కు దాని జాడ క‌నిపించ‌లేదు. అయితే అనూహ్యంగా ఆ జాతి పాము అసోంలో కనిపించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇండియా సైంటిస్టులను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వాటి జాతి అంత‌రించిపోయింద‌నుకున్న 129 ఏళ్ల త‌ర్వాత ఆ పాము క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. 1891లో హెబియస్ పెల్లీ (అసోం కీల్​బాక్) పాములు బ్రిటీష్ టీ ప్లాంటర్ శామ్యూల్​ ఎడ్వర్డ్ పీల్ కు తార‌స‌ప‌డ్డాయి. ఆయ‌న‌ ఈ జాతికి చెందిన రెండు మగ పాములను సేక‌రించి..ఒకటి కోల్​కతాలోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు, మరొక‌టి లండన్​లోని నేచురల్​ హిస్టరీ మ్యూజియానికి తరలించారు. ఆ తర్వాత హెబియస్ పెల్లీ జాతి పాములు ఎక్క‌డా, ఎవ‌రికీ క‌నిపించ‌లేదు.

దాంతో స‌ద‌రు పాము జాతి అంత‌రించిపోయింద‌ని..ఇంక అవి క‌నిపించ‌వ‌ని అందరూ అను‌కున్నారు. అయితే అనూహ్యంగా 2018 సెప్టెంబర్​లో ఎడ్వర్డ్ పీల్ కి క‌నిపించిన‌ ప్రాంతంలోనే వైల్డ్​ లైఫ్ ఇనిస్టిట్యూట్​ సైంటిస్టులకు మళ్లీ ఈ పాము చిక్కింది. వెటర్బేట్​ జువాలజీ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ జర్నల్​లో ఈ విషయాన్ని గ‌త‌ శుక్రవారం ప్రచురించారు.

తమకు కనిపించిన పాముకి అసోం కీల్​బాక్ ఆన‌వాళ్లు ఉండ‌టంతో… వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు లండన్ నేచురల్ మ్యూజియంలో ఉన్న పాము ఆనవాళ్లతో పోల్చి చూసుకుని ఈ విష‌యాన్ని క‌న్ఫామ్ చేశారు. 50 నుంచి 60 సెంటీమీటర్ల వరకూ ఉండే అసోం కీల్​బాక్​ పాములు అంత‌ విషపూరితమైనవి కావ‌ని సైంటిస్టులు తెలిపారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..