నదిలో కారు..కొత్తగా పెళ్లయిన జంట.. స్థానికులే వారికి రక్ష !

ఝార్ఖండ్ లోని ఫలామూ జిల్లాలో భారీ వర్షాల వల్ల అక్కడి నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాపం ! కొత్తగా పెళ్లయిన ఓ జంట కారులో తమ గ్రామానికి తిరిగి వస్తుండగా వారి వాహనం..

నదిలో కారు..కొత్తగా పెళ్లయిన జంట.. స్థానికులే వారికి రక్ష !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 22, 2020 | 3:28 PM

ఝార్ఖండ్ లోని ఫలామూ జిల్లాలో భారీ వర్షాల వల్ల అక్కడి నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాపం ! కొత్తగా పెళ్లయిన ఓ జంట కారులో తమ గ్రామానికి తిరిగి వస్తుండగా వారి వాహనం.. మలయా నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. సుమారు అర కిలోమీటరు దూరం మేర కొట్టుకుపోతూ.. సగం మునిగిపోగా అప్పుడే స్థానికులు కొందరు చూసి వెంటనే తామే వారిని రక్షించేందుకు నదిలో దూకారు. కారు అద్దాలు పగులగొట్టి.. ఆ వాహనానికి తాడును కట్టి మొత్తానికి కారులోని వధూవరులతో బాటు మరో నలుగురైదుగురిని అతి కష్టం మీద రక్షించారు. ఈ ఘటనలో బతికి బయటపడినవారంతా వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీతో బాటు పలు జిల్లాల్లో రెండు మూడు రోజులుగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి.