జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం ఇదే!

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం (Hair Fall) అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి పైకి రాసే నూనెలు, షాంపూల కంటే మనం లోపలికి తీసుకునే ఆహారమే ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది. జుట్టు సంరక్షణకు అవసరమైన సూపర్ ఫుడ్స్‌లో చియా సీడ్స్ (Chia Seeds) అగ్రస్థానంలో ఉంటాయి. చిన్నగా కనిపించే ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే, జుట్టు ఎదుగుదలకు ఇవి పూర్తిగా పనిచేయాలంటే వీటిని ఏ సమయంలో, ఎలా తీసుకోవాలో తెలియడం ఎంతో ముఖ్యం.

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం ఇదే!
Hair Fall Remedies
Image Credit source: tv9 assam

Updated on: Jul 05, 2026 | 12:24 PM

చియా సీడ్స్ (Chia Seeds) లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్, ఐరన్, జింక్ జుట్టు రాలడాన్ని తగ్గించి, వేగంగా పెరగడానికి అద్భుతంగా తోడ్పడతాయి. అయితే, చియా సీడ్స్ తినడానికి ఉత్తమ సమయం ఏందో తప్పక తెలుసుకోవాలి.. అప్పుడే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. జుట్టు వేగంగా పెరగడానికి చియా సీడ్స్ తీసుకోవడానికి ఉదయాన్నే పరగడుపున అత్యంత సరైన సమయం. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా చియా సీడ్స్ వేసి కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ (విషపదార్థాలు) బయటకు పోతాయి. ఇందులోని పోషకాలను స్కాల్ప్ (తల చర్మం) చాలా త్వరగా గ్రహిస్తుంది. ఇది కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తక్షణమే తగ్గిస్తుంది.

ఉదయం వీలుకాని వారు సాయంత్రం సమయంలో చియా సీడ్స్‌ను తీసుకోవచ్చు. నానబెట్టిన చియా గింజలను ఏదైనా ఫ్రూట్ స్మూతీలో లేదా ఒక కప్పు పెరుగు (Yogurt) లో కలుపుకుని స్నాక్స్ లాగా తినవచ్చు. పెరుగులో ఉండే ప్రోటీన్, చియా సీడ్స్‌లోని ఒమేగా-3 కలిసి జుట్టుకు మంచి కండిషనర్‌లా పనిచేసి, జుట్టు పొడిబారకుండా కాపాడతాయి.

జుట్టుకు చియా సీడ్స్ వల్ల కలిగే లాభాలు:

కేశాలకు బలం: చియా సీడ్స్‌లో దాదాపు 23శాతం వరకు నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది. మన జుట్టు కెరాటిన్ అనే ప్రొటీన్‌తోనే తయారవుతుంది కాబట్టి, ఇది జుట్టు ముక్కలు కాకుండా, చిట్లిపోకుండా కాపాడుతుంది.

స్కాల్ప్ ఇన్ఫెక్షన్ల నివారణ: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు తలలో వచ్చే చుండ్రు, దురద వంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

సహజమైన మెరుపు: ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టుకు తగినంత తేమను అందించి, పొడవాటి జుట్టుకు సహజమైన షైనింగ్‌ను ఇస్తాయి.

ముఖ్యమైన జాగ్రత్త:

చియా సీడ్స్‌ను ఎప్పుడూ కూడా నేరుగా పచ్చిగా (డ్రైగా) మింగకూడదు. ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి, నానబెట్టకుండా తింటే జీర్ణక్రియ సమస్యలు రావచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ నీటిలో లేదా పాలలో బాగా నాని జెల్ లాగా మారిన తర్వాతే తీసుకోండి. రోజూ ఒక చెంచా చియా సీడ్స్‌ను మీ డైట్‌లో చేర్చుకుని నల్లని, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us