Beard Tips: మీ గడ్డం రోజూ దురద పుడుతోందా.? అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.!

అబ్బాయిలందరూ కూడా క్లీన్ షేవ్‌కు బదులుగా గడ్డం లుక్‌కే ఎక్కువగా ఓటేస్తున్నారు. గడ్డం పెంచితే సరిపోదు.. దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం...

Beard Tips: మీ గడ్డం రోజూ దురద పుడుతోందా.? అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.!
Beard
Follow us

| Edited By: Venkata Chari

Updated on: Mar 04, 2022 | 12:51 PM

గతంలో అబ్బాయిలు గడ్డం పెంచితే చాలు.. లవ్ ఫెయిల్ అయిందా.? అమ్మాయి మోసం చేసిందా.? అంటూ ఎదుటవారు ప్రశ్నించేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయిలందరూ కూడా క్లీన్ షేవ్‌కు బదులుగా గడ్డం లుక్‌కే ఎక్కువగా ఓటేస్తున్నారు. గడ్డం పెంచితే సరిపోదు.. దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది అయితే.. గడ్డం మరింత అందంగా కనిపించేందుకు పలు క్రీములు, లోషన్స్ వాడుతుంటుంటారు. ఇలాంటి సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే గడ్డం దురద పెట్టే అవకాశం ఉంది. గడ్డంలో దురద మొదలైందంటే.. ఎంతో చిరాకుగా ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి సులభంగా బయటపడాలంటే.. ఈ వంటింటి చిట్కాలను ఫాలో అయితే మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నూనె:

కొన్నిసార్లు గడ్డం దగ్గర చర్మం పొడిబారడం వల్ల దురద పుడుతుంది. ఇందుకోసం వారానికి రెండుసార్లు గడ్డానికి నూనె రాయండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా చేయడం వల్ల దురదను కంట్రోల్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు కూడా మందంగా ఉంటుంది. మార్కెట్‌లో గడ్డానికి మర్దనా చేసే రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. గడ్డానికి సంబంధించిన నూనెను మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే ఆర్గాన్‌ ఆయిల్‌, లెమన్‌ ఆయిల్‌‌ను ఓ సీసాలో వేసి.. రెండింటిని బాగా మిక్స్‌ చేయండి. పూర్తిగా రెండు నూనెలు కలిసిన తర్వాత.. దాన్ని గడ్డానికి రాయండి.

పరిశుభ్రత:

గడ్డాన్ని ఎప్పుడూ సంరక్షించుకోవాలి. ప్రతీ రోజూ స్నానంతో పాటుగా ఒక్కసారైనా ఫేస్ వాష్‌తో గడ్డాన్ని శుభ్రపరుచుకోండి. గడ్డంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే దురద, జుట్టు రాలడం, పగిలిపోవడం వంటి సమస్యలు వస్తాయి.

నిమ్మకాయ, పెరుగు:

గడ్డం దురద పుట్టకుండా.. అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఇంట్లోనే మాస్క్‌ను సిద్దం చేసుకోవచ్చు. గడ్డంలో దురద రాకుండా ఉండేందుకు నిమ్మకాయ, పెరుగు కలిపిన పేస్టును గడ్డానికి అప్లై చేసి దాదాపు అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దానిని తొలగించేందుకు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి గడ్డం మరింత మెరుగ్గా పెరగడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ వార్త కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రచురించాం. ఏదైనా టిప్స్ ఫాలో అయ్యేటప్పుడు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి.