Travel India: ఈ నగరంలో అడడుగునా అందమే.. సూర్యాస్తమం సహా ఎన్ని అందమైన ప్రదేశాలు, ఆలయాలు చూడవచ్చంటే..

Updated on: May 28, 2025 | 5:17 PM

రాజస్తాన్ లోని ప్రతి ప్రాంతం సందర్శకులకు ఆనందాన్ని ఇచ్చేదే. అయితే రాష్ట్రంలోని ఉదయపూర్ సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. దానికి సమీపంలోని అందమైన ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు. జనసమూహానికి దూరంగా ప్రకృతి సౌందర్యం మధ్య సమయం గడపడానికి పర్యాటకులకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రదేశాలు ఉదయపూర్ నుంచి దాదాపు 100 నుండి 200 కి.మీ దూరంలో ఉన్నాయి.

1 / 5
ఉదయపూర్‌ను సరస్సుల నగరం అని మాత్రమే కాదు సూర్యాస్తమయ నగరం అని కూడా పిలుస్తారు. స్థానికులు దీనిని శ్వేత నగరం అనికూడా అంటారు. ఈ నగరం సహజ సౌందర్యం, చారిత్రక భవనాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి సందర్శించడానికి పర్యాటకులు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో వస్తారు. ఉదయపూర్ మాత్రమే కాదు.. రాజస్థాన్‌లో సందర్శించడానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రజలు తమ కుటుంబంతో లేదా స్నేహితులతో ఇక్కడికి సందర్శించాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు ఉదయపూర్ సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ నగరం చుట్టుపక్కల అనేక ప్రదేశాలను అన్వేషించవచ్చు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం అద్భుతం. ఉదయపూర్ సమీపంలోని ఈ ప్రదేశాలను దర్శించవచ్చంటే..

2 / 5
చిత్తౌర్‌గఢ్ ఉదయపూర్ నుంచి 111 కి.మీ దూరంలో ఉంది. ఇది సందర్శించడానికి ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ ఉన్న చిత్తౌర్‌గఢ్ కోట ఒక పెద్ద కోట., ఇది భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ జనసమూహానికి దూరంగా ప్రశాంతంగా సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇక్కడ కాళికా మాత ఆలయం, తుల్జా భవానీ ఆలయం, ప్రసిద్ధ జైన ఆలయాన్ని సందర్శించవచ్చు. అంతేకాదు ఫతే ప్రకాష్ ప్యాలెస్‌లోని మ్యూజియంను కూడా సందర్శించవచ్చు.

3 / 5
బన్‌స్వార ఉదయపూర్ నుంచి దాదాపు 158 కి.మీ దూరంలో ఉంది. ఇది రాజస్థాన్‌లో చాలా ఆకర్షణీయమైన ప్రదేశం. ఇది సహజ సౌందర్యానికి చాలా ప్రసిద్ధి చెందింది. కగడి పికప్ వీర్ అన్వేషించడానికి చాలా అందమైన ప్రదేశం.ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. దీనితో పాటు జువా జలపాతం, సింగ్పురా, దైలాబ్ సరస్సు, కుషాల్‌గఢ్ కోట, ఆనంద్ సాగర్ సరస్సు, మహి బంద్ వంటి ప్రదేశాలను అన్వేషించవచ్చు. దీనితో పాటు తల్వారా ఆలయం, మంగర్ ధామ్ వంటి పవిత్ర ఆలయాలను కూడా సందర్శించవచ్చు.

4 / 5
 
నాథద్వారా ఉదయపూర్ నుంచి దాదాపు 50 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ సందర్శించడానికి అనేక అందమైన ప్రదేశాలు ఆలయాలున్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన శ్రీనాథ్జీ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ అందమైన ఆలయం బనాస్ నది ఒడ్డున ఉంది. ఇక్కడ కృష్ణుడు 7 సంవత్సరాల బాలుడి విగ్రహంగా దర్శనమిస్తాడు. హోలీ, జన్మాష్టమి వంటి పవిత్ర పండుగల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. అంతేకాదు ఇక్కడ  కుంభాల్‌ఘర్ కోట, హల్దీఘాటి , గోవర్ధన్ పర్వతాలను సందర్శించవచ్చు.

5 / 5
దుంగర్‌పూర్ ఉదయపూర్ నుంచి 83 కి.మీ దూరంలో ఉంది. ఇది చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ మీరు ఉదయ్ విలాస్ ప్యాలెస్, జునా మహల్, గైబ్ సాగర్ లేక్, ప్రభుత్వ పురావస్తు మ్యూజియం, ఫతే గర్హి ,  బాదల్ మహల్ వంటి ఆనందమైన ప్రదేశాలను అన్వేషించవచ్చు. అంతేకాదు క్షేత్రపాల్ ఆలయం, శ్రీనాథ్జీ ఆలయం, విజయ్ రాజ్ రాజేశ్వర్ ఆలయం , సుర్పూర్ ఆలయాన్ని సందర్శించవచ్చు.