ప్రేమికులందరూ వాలెంటైన్స్‌డేను ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటారు. వారు ఏదైనా అందమైన ప్రదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తారు. అయితే అక్కడికి ఇక్కడకు ఎందుకు వెళ్లాలి.. తక్కువ బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్‌కు వెళ్లొచ్చు. మీరు ఫారెన్ టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అలాంటి బడ్జెట్ ఫ్రీ లోకేషన్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
థాయ్‌లాండ్ ..
అందమైన బీచ్‌లతో ప్రత్యేక ఆకర్షణ కలిగి ప్రదేశం. అంతే కాదు ఇక్కడ రాత్రి పూట అద్భుతంగా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ రుచి చూస్తే ఆ మజానే వేరు. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మీరు థాయ్‌లాండ్‌లో మీ భాగస్వామితో హాయిగా గడిపేయొచ్చు.
శ్రీలంక..
ప్రేమికుల రోజు కోసం బడ్జెట్‌లో ప్రేమికులు సందర్శించగల మరొక ప్రదేశం శ్రీలంక. అనురాధపుర, సిగిరియాలలో శ్రీలంక సాంప్రదాయ వైభవాన్ని చూడవచ్చు.
నేపాల్..
నేపాల్ బడ్జెట్ స్నేహపూర్వక నగరం. ఇక్కడ ప్రేమికులు తక్కువ బడ్జెట్‌లో ఇక్కడ సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఖాట్మండులో అందమైన ట్రెక్కింగ్ అనుభూతిని పొందవచ్చు. అద్భుతమైన రెస్టారెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఇండోనేషియా..
తక్కువ బడ్జెట్‌లో, బాలి, ఇండోనేషియా వీధి ఆహారాన్ని, ఉత్కంఠభరితమైన సహజ దృశ్యాలను అందిస్తుంది. ప్రేమికులు తక్కువ బడ్జెట్‌తో ఇండోనేషియాను సందర్శించవచ్చు.
వియత్నాం..
ప్రేమికులు సమయాన్ని గడపడానికి వియత్నాం పచ్చటి వాతావరణంతో ఎంతో ఉత్తమమైన ప్రదేశం. హనోయి వీధి, హాల్ ఆన్ స్మారక చిహ్నం ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేమికులు తక్కువ బడ్జెట్‌తో ఇక్కడ సందర్శించవచ్చు.
మలేషియా..
ప్రేమికులు మలేషియాకు 50000 మాత్రమే. ఖర్చు రావచ్చు, పోవచ్చు. ఇక్కడ కౌలాలంపూర్ వీధుల్లో విహరిస్తూ ఆనందంగా గడపవచ్చు. ఛార్జ్ టౌన్ అనే యునెస్కోని కూడా సందర్శించవచ్చు
భూటాన్ ..
అందమైన ప్రకృతి, సంస్కృతిని ప్రతిబింబించే ప్రదేశాలతో కూడిన దేశం. ప్రేమికులు బడ్జెట్‌లో వాలెంటైన్స్ డే కోసం ఇక్కడకు వస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..