నువ్వులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులను అనేక రకాల వంటల్లో కూడా ఉపయోగించి చేస్తూ ఉంటారు. నువ్వుల్లో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. నువ్వులతో కేవలం ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. నువ్వులే కాకుండా నువ్వుల నూనెను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నువ్వుల నూనెను ఎక్కువగా దీపారాధనకు, జుట్టుకు పట్టించడానికి, చర్మానికి రాసుకోవడాని ఉపయోగిస్తారు. నువ్వుల నూనె రాయడం వల్ల ఎన్నో రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ శీతా కాలంలో నువ్వుల నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. శరీరానికి మొత్తం నువ్వుల నూనె పట్టించడం వల్ల.. ఎన్నో రోగాలు రాకుండా ఉంటాయి. నువ్వుల నూనెను ఆయుర్వేదంలో కూడా పలు రకాల సమస్యలను కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో పలు రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. నువ్వుల నూనె రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల నూనెను రాత్రి పడుకునే ముందు ముఖానికి బాగా పట్టించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే మీ ముఖం మెరుస్తూ.. యవ్వనంగా కనిపిస్తారు. కొద్ది రోజులు చేయగానే మీకు ఫలితం కనిపిస్తుంది.
నువ్వుల నూనెతో చిన్నారులకు బాడీ మసాజ్ చేస్తే చాలా మంచిది. తలకు, ఒంటికి బాగా పట్టించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. శరీర నొప్పులు వంటివి తగ్గి.. చర్మం కాంతి వంతంగా అందగా కనిపిస్తారు. నువ్వుల నూనెలో విటమిన్స్, మినరల్స్ వంటివి చక్కగా ఉంటాయి. మెదడు ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. వెన్నుముక, కండరాలు బల పడేందుకు సహాయ పడుతుంది. పెదాలు కూడా పొడిబారకుండా ఉంటుంది. చర్మం ఎంతో కోమలంగా, మృదువుగా మారుతుంది. చిన్నారులు చాలా యాక్టీవ్‌గా ఉంటారు.
నువ్వుల నూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది. గుండె పని తీరు మెరుగు పడుతుంది. త్వరగా హార్ట ఎటాక్‌లు వంటివి రాకుండా ఉంటాయి.
శరీర వాపులతో బాధ పడేవారు కొద్ది రోజులు నువ్వుల నూనెతో శరీరం అంతా మర్దనా చేసుకుంటే వాపులు కంట్రోల్ చేయడమే కాకుండా.. కీళ్లనొప్పులను కూడా తగ్గిస్తాయి. కీళ్లు, రక్త నాళాలు దృఢంగా మారతాయి. మైగ్రేన్, పేగు క్యాన్సర్, శ్వాస కోశ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. నువ్వుల నూనె తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.