‘సర్వేద్రియానం నయనం ప్రధానం’ అంటారు పెద్దలు. శరీరంలో ఉండే అన్ని అవయవాల కంటే ముఖ్యమైనవి కళ్లే. కళ్లు లేకుండా ఎలాంటి పని చేయలేం. కళ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కేవలం పెద్దలే కాకుండా పిల్లల కళ్ల విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. చిన్న వయసులోనే చాలా మంది పిల్లలకు కళ్లజోడు పడుతుంది. ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూసినా కూడా కంటి చూపు దెబ్బతింటుంది. కళ్లు ఆరోగ్యంగా పని చేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కాబట్టి పిల్లల పట్ల అస్సలు నిర్లక్ష్యం వహించకండి. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం అవసరం. మరి పిల్లల కళ్లు ఆరోగ్యంగా పని చేయాలంటే ఎలాంటి ఆహారాలు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల కళ్లు ఆరోగ్యంగా పని చేయాలంటే కాయ ధాన్యాలు ఎక్కువగా పెట్టాలి. చిక్కుళ్లు, బీన్స్ వంటి వాటిల్లో కారం తక్కువగా వేసి పిల్లలకు పెట్టాలి. వీటిల్లో బయోఫ్లేవనాయిడ్స్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంట్లో వచ్చే నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
కళ్లు ఆరోగ్యంగా ఉంచడంలో నట్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పిల్లలకు.. వాల్ నట్స్, బాదం, పిస్తా, కాజు వంటివి తినడం వల్ల మంచి పోషకాలు అందుతాయి. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.
పిల్లలకు కూడా మొదటి నుంచి ఆకు కూరలు పెట్టడం అలవాటు చేయాలి. కారం లేకుండా కొద్ది కొద్దిగా ఆకు కూరలను కూడా ఇస్తూ ఉండాలి. ఇలా పెట్టడం వల్ల ఆకు కూరల్లో ఉండే పోషకాలు చక్కగా అందుతాయి. ఎందుకంటే వీటిల్లో విటమిన్ సి, ఇ, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరచడంలో హెల్ప్ చేస్తాయి.
కళ్లు ప్రకాశంవతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. తాజా పండ్లు, కూరగాయలు తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా పని చేస్తాయి. కంటి చూపు మెరుగు పడటమే కాకుండా భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి. పుల్లగా ఉండే పండ్లు ఇవ్వడం వల్ల కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఎక్కువగా ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.