Almond Oil: బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..

|

Dec 27, 2024 | 6:19 PM

బాదం నూనె వాడకం కొన్నేళ్ల నుంచి ఉంది. ఆయుర్వేదంలో కూడా బాదం నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నూనెతో కేవలం చర్మ అందమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. బాదం నూనెతో చెప్పలేనన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

Almond Oil: బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
Almond Oil
Follow us on

బాదం నూనె వాడకం ఎప్పటి నుంచో ఉంది. కొన్నేళ్లుగా బాదం నూనెను స్కిన్, హెయిర్ కేర్‌కి ఉపయోగిస్తూ ఉంటున్నారు. బాదం నూనెతో ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. అనేక చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో కూడా బాదం నూనెను ఉపయోగిస్తున్నారు. బాదం నూనెతో కేవలం అందమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. బాదం పప్పుతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో.. వీటి నుంచి తీసే నూనెతో కూడా అన్నే ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆయిల్‌లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అనేక ఆరోగ్య సమస్యల నుండి రిలీఫ్‌ని ఇష్తుంది. అయితే ఈ ఆయిల్‌‌ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మాత్రం తెలుసుకోవాలి. మరి బాదం నూనెతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఎలాంటి సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

మలబద్ధకం పరార్:

అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది చిన్న పిల్లల్లో ఈ సమస్యను చూస్తూ ఉంటారు. మల బద్ధకం సమస్య ఉంటే పొట్ట అంతా ఉబ్బరంగా మారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ నుంచి బయట పడాలంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు లేదా పాలలో ఒక స్పూన్ బాదం ఆయిల్ కలిపి ఉదయాన్నే తాగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.

ఎముకలు బలం:

బాదం నూనెతో ఎముకలను కూడా బలంగా, దృఢంగా తయారు చేసుకోవచ్చు. పెద్దలు, పిల్లలు కూడా ఈ ఆయిల్‌ని తాగవచ్చు. పిల్లల కండరాలు, ఎముకలు బలపడతాయి. జుట్టు, చర్మ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. పాలలో లేదా నీళ్లలో కలిపి తాగితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

బాదం నూనె తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఉండే పోషకాలు.. రోగాలు, వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. మెదడుని కూడా యాక్టీవ్ చేస్తాయి. సలాడ్స్ వంటి వాటిపై ఆయిల్ వేసి తినవచ్చు.

నిద్ర లేమి సమస్య దూరం:

నిద్రలేమి సమస్యతో బాద పడేవారు కూడా బాదం ఆయిల్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గోరు వెచ్చని పాలు లేదా నీళ్లలో కలిపి తీసుకుంటే ఈ సమస్య కంట్రోల్ అవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.