Joint Pains: ఈ మూలికలను ఒక్కసారి వాడితే చాలు.. కీళ్ల నొప్పులకు తగ్గుతాయి..

|

Jul 07, 2024 | 1:09 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. ఒకప్పుడు ఈ కీళ్ల నొప్పులు అనేవి కేవలం పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ పోషకాహార లోపం కారణంగా ఇప్పుడు యంగ్‌ ఏజ్‌లో ఉన్నవారికి కూడా వస్తున్నాయి. వీటి కారణంగా ఎలాంటి పనులు చేసుకోవాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మీ లైఫ్ స్టైల్‌, ఆహారం విషయంలో మాత్రం మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. కీళ్ల నొప్పులను తగ్గించడంలో వంట గదిలో ఉండే..

Joint Pains: ఈ మూలికలను ఒక్కసారి వాడితే చాలు.. కీళ్ల నొప్పులకు తగ్గుతాయి..
Joint Pains
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. ఒకప్పుడు ఈ కీళ్ల నొప్పులు అనేవి కేవలం పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ పోషకాహార లోపం కారణంగా ఇప్పుడు యంగ్‌ ఏజ్‌లో ఉన్నవారికి కూడా వస్తున్నాయి. వీటి కారణంగా ఎలాంటి పనులు చేసుకోవాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మీ లైఫ్ స్టైల్‌, ఆహారం విషయంలో మాత్రం మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. కీళ్ల నొప్పులను తగ్గించడంలో వంట గదిలో ఉండే ఈ మూలికలు ఎంతో చక్కగా, ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. మరి ఆ మూలికలు ఏంటి? వాటితో ఎలా కీళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

యాలకులు:

నిత్యం మనం ఉపయోగించుకునే వాటిల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులు ప్రతీ వంటగదిలో ఉంటాయి. యాలకులను మీ ఆహారంలో భాగం చేసుకోవడం కారణంగా.. కీళ్ల నొప్పులను తగ్గించవచ్చు. శరీర నొప్పులను తగ్గించడంలో యాలకులు చక్కగా పని చేస్తాయి.

మిరియాలు:

మిరియాలను కింగ్ ఆఫ్ స్పైస్ అని పిలుస్తారు. ఇందులో ఉండే ఘాటు ఇతర వాటిల్లో కూడా లభ్యం కాదు. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్, వాపులు, మంట సమస్యను తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో కూడా అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎపిగల్లో కేటాచ్ ఇన్ 3 గాలెట్ అనే ఫాలిఫైనల్ ఉంటుంది. ఇది కీళ్లలో ఉండే మంట సమస్యను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు తరచూ గ్రీన్ టీ తాగితే కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.

పసుపు:

పసుపులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీయల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు.. అర్థరైటిస్ సమస్యలకు, జాయింట్ పెయిన్స్‌ను తగ్గిస్తాయి. పసుపు, మిరియాలు కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

వెల్లుల్లి:

వంట గదిలో లభ్యమయ్యే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వీటితో కూడా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. జాయింట్ పెయిన్స్‌ను తగ్గించడంలో ఇవి ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో కూడా ఎన్నో ఏళ్లుగా వెల్లుల్లిని పలు సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..