Blanket Covered Face: ముఖం నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా.. మీకోసమే ఈ విషయాలు!

|

Nov 26, 2024 | 4:53 PM

చలి కాలంలో చలి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది దుప్పటి కప్పుకుని పడుకుంటారు. కొంత మంది కేవలం నడుము వరకు కప్పుకుంటే.. మరికొంత మంది ముఖం నుంచి కాళ్ల వరకు మొత్తం శరీరం కప్పుకుని పడుకుంటారు..

Blanket Covered Face: ముఖం నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా.. మీకోసమే ఈ విషయాలు!
Blanket Covered Face
Follow us on

చలి కాలం వచ్చిదంటే దుప్పట్లకు పని ఎక్కువగా పడుతుంది. దుప్పటి కప్పుకుంటేనే గానీ ఈ చలి నుంచి ఉపశమనం లభించదు. ఫ్యాన్ కడదామంటే.. దోమలు కుడతాయనే బాధ. అందుకే ఇక పై నుంచి కింద దాకా ముఖం కూడా కనిపించకుండా దుప్పలి కప్పుకుని పడుకుంటూ ఉంటారు. ఇలా ముఖం కూడా కనిపించకుండా పై నుంచి కింద దాకా దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు పాడవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు శరీరం మొత్తం దుప్పటి కవర్ చేసుకుని పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మానికి హానికరం:

దుప్పటి ఫేస్ నుంచి కాళ్ల వరకు కవర్ చేసుకుని నిద్రించడం వల్ల చర్మానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. దుప్పటి కప్పుకోవడం వల్ల గాలి శరీరానికి తగలదు. దీని వల్ల అపరి శుభ్రమైన గాలి అనేది బయటకు వదలదు. మీరు వదిలే కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్లకుండా మీ దుప్పటిలోనే ఉండిపోతుంది. అదే గాలి పీల్చడం వల్ల మీ చర్మం రంగు అనేది మారిపోతుంది. త్వరగా ముఖంపై ముడతలు అనేవి వస్తాయి. పింపుల్స్ కూడా రావచ్చు. అంతే కాకుండా అలెర్జీలు, ఇతర చర్మ సమస్యలు రావచ్చు.

ఊపిరి తిత్తులకు హాని:

ముఖానికి కూడా దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల చర్మానికే కాకుండా మూత్ర పిండాలకు కూడా హాని కలుగుతుంది. ఊపిరి అనేది సరిగ్గా ఆడక పోవడం వల్ల ఊపిరి తిత్తులు అనేవి కుంచించుకు పోవడం ప్రారంభం అవుతాయి. తలనొప్పి, ఆస్తమా, వికారం వంటి సమస్యలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణపై ఎఫెక్ట్:

దుప్పటి ముఖం నిండా కప్పి పడుకోవడం వల్ల రక్త ప్రసరణపై కూడా ఎఫెక్ట్పడుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్లకుండా.. ఆక్సిజన్ రావడానికి రావడానికి మార్గం ఉండదు. దీని వల్ల రక్త ప్రసరణ అనేది సరిగా జరగదు. రక్త ప్రసరణ జరిగేందుకు చాలా సమయం తీసుకుంటుంది.

గుండె పోటు:

శరీరం మొత్తం దుప్పటి కప్పుకుని పడుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుండెకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల.. గుండె నొప్పి వంటివి రావచ్చు. తల తిరగడం, వికారం వంటి సమస్యలు కూడా రావచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..