AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జొన్న రొట్టెలు విరిగిపోతున్నాయా? ఈ సింపుల్ పద్ధతిలో చేసారంటే పూరీలా పొంగుతాయి!

జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచివైనా, చాలామందికి ఇవి చేసేటప్పుడు విరిగిపోవడం లేదా పగిలిపోవడం పెద్ద సమస్యగా ఉంటుంది. అయితే, వేడి నీటిని ఉపయోగించి పిండిని కలపడం ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ముందుగా ఒక కప్పు జొన్న పిండికి ఒక కప్పు వేడి మరుగుతున్న నీటిని కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే పిండి చక్కగా మృదువుగా మారుతుంది.

జొన్న రొట్టెలు విరిగిపోతున్నాయా? ఈ సింపుల్ పద్ధతిలో చేసారంటే పూరీలా పొంగుతాయి!
Jowar Roti Making Tips
Jyothi Gadda
|

Updated on: Nov 14, 2026 | 8:57 PM

Share

ఆరోగ్యరీత్యా గ్లూటెన్-ఫ్రీ ఆహారాలకు ప్రాధాన్యతనిచ్చే వారు ఎక్కువగా జొన్న రొట్టెలను ఎంచుకుంటారు. జొన్నల్లో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, చాలామందికి జొన్న రొట్టెలు చేసేటప్పుడు అవి సరిగ్గా రావు. రొట్టెలు ఒత్తుతున్నప్పుడు అంచులు పగిలిపోవడం, పెనంపై వేయగానే విరిగిపోవడం లేదా గట్టిగా మారిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మీకోసం జొన్న రొట్టెలు ఎప్పుడూ విరిగిపోకుండా, ఎంతో మృదువుగా మరియు గుండ్రంగా రావడానికి ఒక అద్భుతమైన వంట చిట్కా ఇక్కడ ఉంది.

జొన్న పిండి కలపడంలోనే అసలు రహస్యం:

సాధారణంగా గోధుమ పిండిలాగే జొన్న పిండిని చల్లటి నీటితో కలిపితే అది సాగదు, దాంతో రొట్టెలు సులభంగా విరిగిపోతాయి. దీన్ని నివారించడానికి ‘హాట్ వాటర్ డఫ్’ (Hot Water Dough) పద్ధతిని పాటించాలి.

తయారీ విధానం:

కావలసిన పదార్థాలు: 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు మరుగుతున్న వేడి నీరు, పొడి జొన్న పిండి (అవసరమైనంత).

ఇవి కూడా చదవండి

వేడి నీటితో కలపడం: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో, అదే కప్పుతో ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి.

పిండి నానబెట్టడం: ఆ మరుగుతున్న నీటిని కొద్దికొద్దిగా జొన్న పిండిలో పోస్తూ గరిటెతో కలపాలి. ఆ తర్వాత దాన్ని మూతపెట్టి కొన్ని నిమిషాల పాటు ఆవిరిపై మగ్గనివ్వాలి.

మృదువుగా పిండిని మద్దడం: పిండి కొద్దిగా గోరువెಚ್ಚగా మారిన తర్వాత, చేతులతో బాగా ఒత్తుతూ 3 నుంచి 4 నిమిషాల పాటు కలపాలి. పిండి ఎంత మృదువుగా కలిపితే, రొట్టె అంత చక్కగా వస్తుంది.

రొట్టె చేసే విధానం:

తయారు చేసుకున్న పిండి నుండి చిన్న ఉండను తీసుకుని, చేతితో గుండ్రంగా చుట్టాలి. పొడి పిండిని చల్లుకుంటూ  రొట్టెల పీటపై ఉంచి నెమ్మదిగా ఒత్తుకోవాలి. వేడెక్కిన పెనంపై రొట్టెను వేసి, దాని పైభాగంలో తడి గుడ్డతో లేదా చేతితో కొద్దిగా నీటిని రాయాలి. ఇలా చేయడం వల్ల రొట్టెపై పగుళ్లు రావు. కొద్దిసేపు అయిన తర్వాత మరోవైపు తిప్పి, గుడ్డతో అంచులపై మెత్తగా నొక్కితే రొట్టె గులాబీ పువ్వులా చక్కగా పొంగుతుంది. ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే ఎవరైనా సరే నిమిషాల్లో అద్భుతమైన జొన్న రొట్టెలు తయారు చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us