AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో రోజూ గుప్పెడు బాదం తినండి.. శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే!

శీతాకాలంలో బాదం పప్పులను రోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. విటమిన్-ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండే బాదం, శరీరానికి చలికాలంలో కావాల్సినంత వేడిని, శక్తిని అందిస్తుంది. రోజూ ఉదయం పూట నానబెట్టి, పొట్టు తీసిన బాదం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం తీసుకోవడం శీతాకాలపు అనారోగ్యాలను దూరం ఉంచడానికి చక్కటి మార్గం.

చలికాలంలో రోజూ గుప్పెడు బాదం తినండి.. శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే!
Almonds Health Benefits
Jyothi Gadda
|

Updated on: Nov 14, 2026 | 6:24 PM

Share

శీతాకాలం రాగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి. ఈ చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, సూపర్‌ఫుడ్‌గా పిలువబడే బాదం పప్పులను ఈ సీజన్‌లో క్రమం తప్పకుండా తింటే అసాధారణమైన ఆరోగ్య లాభాలను పొందవచ్చు. బాదంలో విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

రోగనిరోధక శక్తి పెంపు:

చలికాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ వంటి సమస్యలు సర్వసాధారణం. బాదంలో ఉండే విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి.

గుండె ఆరోగ్యం:

బాదంలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ క్రమం తప్పకుండా బాదం తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చర్మాన్ని తేమగా ఉంచుతుంది:

చలికాలంలో చలిగాలుల కారణంగా చర్మం పొడిబారి నిర్జీవుగా మారుతుంది. బాదంలోని విటమిన్-ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి లోపలి నుంచి పోషణనిచ్చి, చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా ఉంచుతాయి.

మెదడు పనితీరు మెరుగుపడుతుంది:

బాదం తింటే బుర్ర చురుగ్గా పనిచేస్తుంది అని పెద్దలు చెప్పడంలో శాస్త్రీయ నిజం ఉంది. బాదంలో ఉండే రైబోఫ్లేవిన్ మరియు ఎల్-కార్నిటైన్ వంటి పోషకాలు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో ఎంతో తోడ్పడతాయి.

బరువు, బ్లడ్ షుగర్ నియంత్రణ:

చలికాలంలో చాలామంది శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరుగుతుంటారు. బాదంలో ఉండే ఫైబర్ మరియు ప్రొటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన తిళ్లను నియంత్రిస్తుంది. అలాగే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి కూడా ఇది సురక్షితమైన స్నాక్.

బాదం ఎలా, ఎప్పుడు తినాలి?:

బాదంను నేరుగా తినడం కంటే, రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం పొట్టు తీసి తినడం వల్ల పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. రోజుకు ఒక గుప్పెడు (సుమారు 20-23 బాదంలు) తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఈ శీతాకాలంలో మీ దైనందిన ఆహారంలో బాదమ్‌ను భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చలికాలంలో రోజూ గుప్పెడు బాదం తినండి.. శరీరానికి కలిగే అద్భుతమైన
చలికాలంలో రోజూ గుప్పెడు బాదం తినండి.. శరీరానికి కలిగే అద్భుతమైన
 దీపావళి తర్వాత షుగర్ పెరగడానికి కారణాలివే!
 దీపావళి తర్వాత షుగర్ పెరగడానికి కారణాలివే!
సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిన స్కై.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిన స్కై.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
కళ్లలో కారం చల్లి వాటర్ ట్యాంకర్ డ్రైవర్ దారుణ హత్య.. 8 ఏళ్లకు..
కళ్లలో కారం చల్లి వాటర్ ట్యాంకర్ డ్రైవర్ దారుణ హత్య.. 8 ఏళ్లకు..
తెలంగాణ గిగ్ వర్కర్స్ పాలసీని ప్రారంభించిన రాహుల్ గాంధీ..
తెలంగాణ గిగ్ వర్కర్స్ పాలసీని ప్రారంభించిన రాహుల్ గాంధీ..
పూజ సమయంలో ఈ వస్తువులను పొరపాటున కూడా నేలపై పెట్టకండి.. ఎందుకంటే
పూజ సమయంలో ఈ వస్తువులను పొరపాటున కూడా నేలపై పెట్టకండి.. ఎందుకంటే
ఆ హీరోయిన్ డాన్స్ కోసం చాలా కష్టపడింది..
ఆ హీరోయిన్ డాన్స్ కోసం చాలా కష్టపడింది..
విశాఖ అమ్మాయికి అర్జున అవార్డు.. గర్వంగా ఉందంటూ చంద్రబాబు కితాబు
విశాఖ అమ్మాయికి అర్జున అవార్డు.. గర్వంగా ఉందంటూ చంద్రబాబు కితాబు
ఖరీదైన క్రీమ్స్ కాదు.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..
ఖరీదైన క్రీమ్స్ కాదు.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..
గ్రహాల అనుకూలత.. ఈ ఏడాది చివరికల్లా వీరు అనుకున్నది సాధిస్తారు..!
గ్రహాల అనుకూలత.. ఈ ఏడాది చివరికల్లా వీరు అనుకున్నది సాధిస్తారు..!