AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెనంపై రొట్టెలు మాడిపోతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో సమస్యకు చెక్ పెట్టండి!

ఇళ్లలో రోజూ రొట్టెలు చేసేటప్పుడు పెనం అతిగా వేడెక్కడం వల్ల రొట్టెలు మాడిపోవడం లేదా అతుక్కోవడం జరుగుతుంది. దీనివల్ల రొట్టెలు సరిగ్గా పొంగవు, రుచిగా ఉండవు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ఈ సాధారణ వంటింటి చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఈ సింపుల్ ట్రిక్‌తో సమస్యకు చెక్ పెట్టండి!

పెనంపై రొట్టెలు మాడిపోతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో సమస్యకు చెక్ పెట్టండి!
Rotis Getting Burnt On The Tawa
Jyothi Gadda
|

Updated on: Nov 14, 2026 | 7:59 PM

Share

భారతీయ ఇళ్లలో రొట్టెలు చేయడం అనేది ప్రతిరోజూ జరిగే పనే. అయితే, చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య ఏమిటంటే.. పెనంపై రొట్టె వేయగానే అది మాడిపోవడం లేదా అతుక్కోవడం జరుగుతుంది. తవా అతిగా వేడెక్కడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఇలా జరిగినప్పుడు రొట్టెలు సరిగ్గా పొంగవు, పైగా గట్టిగా మారుతాయి. మీ ఇళ్లలో కూడా రొట్టెలు తరచుగా మాడిపోతుంటే, ఈ సులభమైన వంటింటి చిట్కా మీకోసమే!

తవాపై రొట్టెలు ఎందుకు మాడిపోతాయి?:

సాధారణంగా తవా అవసరానికి మించి ఎక్కువగా వేడెక్కినప్పుడు, దానిపై వేసే పిండి త్వరగా మాడిపోతుంది. రొట్టె వేసిన వెంటనే నల్లటి మచ్చలు ఏర్పడతాయి. రొట్టెలు మెత్తగా, గుండ్రంగా మరియు చక్కగా రావాలంటే తవా వేడిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

రొట్టెలు మాడిపోకుండా ఉండేందుకు అద్భుతమైన ట్రిక్:

మీ తవా చాలా వేడెక్కి రొట్టెలు మాడిపోతుంటే, వంటగదిలో ఉండే సాధారణ ఉప్పును ఉపయోగించి ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.

ఇవి కూడా చదవండి

ముందుగా స్టవ్ ఆపి, వేడెక్కిన తవాను కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆ తవాపై కొద్దిగా సాధారణ ఉప్పును వేయాలి. ఒక శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా కిచెన్ టిష్యూ సహాయంతో ఆ ఉప్పును తవా అంతటా సమానంగా రుద్దాలి. కొద్దిసేపు ఉప్పును అలా తిప్పిన తర్వాత దాన్ని తొలగించాలి.

ఇలా చేయడం వల్ల తవా ఉపరితలంపై ఉండే జిడ్డుదనం పోయి, అది సహజమైన నాన్‌-స్టిక్ ఉపరిలా పనిచేస్తుంది. ఆ తర్వాత మీరు రొట్టెలు చేస్తే అవి తవాకు అతుక్కోవు, అస్సలు మాడిపోవు.

గుర్తుంచుకోవాల్సిన ఇతర ముఖ్యమైన విషయాలు:

రొట్టెలు చేసేటప్పుడు తవాను అతిగా వేడెక్కనివ్వకండి. మధ్యమధ్యలో మంటను అదుపులో ఉంచాలి. తవాపై మిగిలిపోయిన పిండిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ప్రతిసారీ ఎంతో మృదువైన, చక్కగా పొందిన రొట్టెలను సులభంగా తయారు చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెనంపై రొట్టెలు మాడిపోతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో సమస్యకు చెక్
పెనంపై రొట్టెలు మాడిపోతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో సమస్యకు చెక్
ప్రశ్నించడమే ఆమె చేసిన పాపమా.. భర్త కోపానికి బలైన భార్య
ప్రశ్నించడమే ఆమె చేసిన పాపమా.. భర్త కోపానికి బలైన భార్య
కొండెక్కిన చికెన్, కోడిగుడ్ల ధరలు.. అయ్యో.. కిలో ఎంతంటే..?
కొండెక్కిన చికెన్, కోడిగుడ్ల ధరలు.. అయ్యో.. కిలో ఎంతంటే..?
బుగ్గ మల్లేశ్వర క్షేత్రం.. శివుడి పక్కనే గంగమ్మ కొలువైన అద్భుత..
బుగ్గ మల్లేశ్వర క్షేత్రం.. శివుడి పక్కనే గంగమ్మ కొలువైన అద్భుత..
భారత్ మండపంలో అంబరాన్ని అంటిన ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు
భారత్ మండపంలో అంబరాన్ని అంటిన ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు
ఇంట్లోనే గింజల ద్వారా తామర పూలను ఎలా పెంచాలి? గార్డెనింగ్ టిప్స్
ఇంట్లోనే గింజల ద్వారా తామర పూలను ఎలా పెంచాలి? గార్డెనింగ్ టిప్స్
ఒకే ఒక్క సినిమాతో ఆయన విలన్‌గా బాగా పాపులర్ అయ్యాడు..
ఒకే ఒక్క సినిమాతో ఆయన విలన్‌గా బాగా పాపులర్ అయ్యాడు..
ఇలాంటి సందర్భాల్లో పీఎఫ్ కట్ అయినా పెన్షన్ బంద్..
ఇలాంటి సందర్భాల్లో పీఎఫ్ కట్ అయినా పెన్షన్ బంద్..
ఓటమి అంచు నుంచి విజయ శిఖరాలకు.. భారత్‌ను గెలిపించిన మోహిత్
ఓటమి అంచు నుంచి విజయ శిఖరాలకు.. భారత్‌ను గెలిపించిన మోహిత్
సినిమాల మీద పిచ్చితో మద్రాస్ రైలెక్కి..
సినిమాల మీద పిచ్చితో మద్రాస్ రైలెక్కి..