Pregnancy: గ‌ర్భిణీలు బ‌రువు పెర‌గ‌డం మంచిదేనా.? ఎప్పుడు జాగ్ర‌త్త ప‌డాలి..

నిజానికి బ‌రువు పెర‌గ‌క‌పోతేనే ఆందోళ‌న చెందాల్సి ఉంటుంది. అయితే గ‌ర్భధార‌ణ స‌మ‌యంలో మ‌హిళ‌లు ఎంత బ‌రువు పెరిగితే మంచిది. ఎక్కువ బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల త‌లెత్తే స‌మ్య‌లు ఏంటి.? ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Pregnancy: గ‌ర్భిణీలు బ‌రువు పెర‌గ‌డం మంచిదేనా.? ఎప్పుడు జాగ్ర‌త్త ప‌డాలి..
Pregnancy
Follow us

|

Updated on: Aug 04, 2024 | 10:59 AM

ప్ర‌తీ మ‌హిళ జీవితంలో అత్యంత కీల‌కమైన ద‌శ గ‌ర్భం దాల్చ‌డం. త‌న‌లాంటి మ‌రో రూపానికి జ‌న్మనిస్తున్నాన్న ఆనందం ఒక్క మ‌హిళ‌కే సొంతం. అలాంటి గ‌ర్భ‌స్థ స‌మ‌యాన్ని మ‌హిళ‌లు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇదే స‌మ‌యంలో వారిని కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు వెంటాడుతుంటాయి. ఇలంటి వాటిలో ప్ర‌ధాన‌మైంది బ‌రువు పెర‌గ‌డం. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో బ‌రువు పెర‌గ‌డం అత్యంత సాధార‌ణ‌మైన ప్ర‌క్రియ‌.

నిజానికి బ‌రువు పెర‌గ‌క‌పోతేనే ఆందోళ‌న చెందాల్సి ఉంటుంది. అయితే గ‌ర్భధార‌ణ స‌మ‌యంలో మ‌హిళ‌లు ఎంత బ‌రువు పెరిగితే మంచిది. ఎక్కువ బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల త‌లెత్తే స‌మ్య‌లు ఏంటి.? ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సాధార‌ణంగా గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో మ‌హిళ‌లు 10 కిలోల‌ పెరుగుతారు. అయితే అంద‌రిలో ఇదే ఒకే ర‌కంగా ఉంటుంద‌ని చెప్ప‌లేం. ఈ బ‌రువు పెర‌గ‌డం వారి ఆరోగ్య ప‌రిస్థితి, తీసుకుంటున్న ఆహారంపై ఆధార‌ప‌డి ఉంటుంది. సాధార‌ణంగా మొద‌టి త్రైమాసికం అంటే 0 నుంచి 3 నెల‌ల మ‌ధ్య మ‌హిళ బ‌రువు 1 నుంచి కిలోలు పెరుగుతుంది. అయితే రెండో త్రైమాసికంలో 4 నుంచి 6 నెల‌ల స‌మ‌యంలో బ‌రువులో వేగ‌మైన మార్పు క‌నిపిస్తుంది. ఈ స‌మ‌యంలో మ‌హిళ‌ల బ‌రువు 5 నుంచి 7 కిలోల వ‌ర‌కు పెరుగుతుంది. మూడో త్రైమాసికం అంటే 7 నుంచి 9 నెల‌ల‌ల్లో 5 నుంచి 7 కిలోల వ‌ర‌కు పెరుగుతారు. అయితే ఇంత‌కు మించి కూడా బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుంది. ముఖ్యంగా హార్మోన్ల వ్య‌త్యాసం కార‌ణంగా మ‌హిళ‌లు అధిక బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుంది.

గ‌ర్భిణీలు ఉన్న‌ప‌లంగా బ‌రువు పెరిగే ర‌క్త‌పోటు స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇది త‌ల్లితోపాటు బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అధిక రక్తపోటు కారణంగా, డెలివరీలో సమస్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇక బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల మ‌హిళ‌ల్లో డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయి. అధిక బరువు పెరగడం వ‌ల్ల నార్మ‌ల్ డెలివ‌రీకి ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి వారిలో త‌ప్ప‌నిస‌రిగా సిజేరియ‌న్ చేయాల్సి వ‌స్తుంది. ఇక అధిక బ‌రువు కార‌ణంగా గ‌ర్భిణీల్లో వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

ఇలా చేయండి..

గ‌ర్భిణీలు అధిక బ‌రువు పెర‌గ‌కుండా ఉండాలంటే కొన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులను భాగం చేసుకోవాలి. అలాగే వైద్యుల సూచన మేర‌కు తేలిక‌పాటి వ్యాయామం చేయాలి. యోగా, మెడిటేష‌న్ వంటివి అల‌వాటు చేసుకోవాలి. ఇక శ‌రీరంలో నీటి శాతం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. జంక్ ఫుడ్ జోలికి అస్స‌లు వెళ్ల‌కూడ‌దు.

నోట్‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

మ‌రిన్ని లైఫ్ స్టైల్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..

గ‌ర్భిణీలు బ‌రువు పెర‌గ‌డం మంచిదేనా.? ఎప్పుడు జాగ్ర‌త్త ప‌డాలి..
గ‌ర్భిణీలు బ‌రువు పెర‌గ‌డం మంచిదేనా.? ఎప్పుడు జాగ్ర‌త్త ప‌డాలి..
రాత్రి డబ్బును బీరువాలో పెట్టాడు.. కట్ చేస్తే, ఊహించని షాక్..
రాత్రి డబ్బును బీరువాలో పెట్టాడు.. కట్ చేస్తే, ఊహించని షాక్..
మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసిన నిర్మాత.. కానీ
మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసిన నిర్మాత.. కానీ
మల్లన్న ఆలయంలో పెరిగిన భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం..
మల్లన్న ఆలయంలో పెరిగిన భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం..
రాహుల్ ద్రవిడ్ భారీ రికార్డ్‌ను బద్దలు కొట్టనున్న హిట్‌మ్యాన్..
రాహుల్ ద్రవిడ్ భారీ రికార్డ్‌ను బద్దలు కొట్టనున్న హిట్‌మ్యాన్..
అనారోగ్యంతో ఐఏఎస్ కల విడిచి ఒకేసారి ఆరు ఉద్యోగాలకు ఎంపికైన అక్షిత
అనారోగ్యంతో ఐఏఎస్ కల విడిచి ఒకేసారి ఆరు ఉద్యోగాలకు ఎంపికైన అక్షిత
ఏ కార‌ణం లేకుండా తల తిరుగుతోందా.? కార‌ణాలు ఇవే కావొచ్చు..
ఏ కార‌ణం లేకుండా తల తిరుగుతోందా.? కార‌ణాలు ఇవే కావొచ్చు..
IND vs SL: ఐసీసీ కొత్త రూల్ మర్చిపోయిన అంపైర్.. కట్‌చేస్తే..
IND vs SL: ఐసీసీ కొత్త రూల్ మర్చిపోయిన అంపైర్.. కట్‌చేస్తే..
చాక్లెట్‌ ఇస్తానని బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే
చాక్లెట్‌ ఇస్తానని బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!