తెలంగాణలో అద్భుత కోటకి 18వ శతాబ్దం నాటి చరిత్ర..
TV9 Telugu
04 August 2024
2022లో ఆసియా-పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ అవార్డుకు తెలంగాణ గత కాలపు ఘన కీర్తి బావుటాను ప్రపంచం ఎదుట సగర్వంగా ఎగురవేస్తోంది దోమకొండ కోట.
18వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోటలో అనేక అద్భుత కట్టడాలు ఉన్నాయి. మమ్మల్ని తలెత్తి చూడాల్సిందే అన్నంత ఠీవిగా చూస్తుంటాయి దోమకొండ కోట బురుజులు.
లోపలకు అడుగు పెడితే చరిత్ర పేజీలు కళ్ల ముందు తిరుగుతాయి. ప్రస్తుతం ఈ కోట తెలుగు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉంది.
దోమకొండ కోట తెలంగాణలోని ప్రాచీన సంస్థానాల్లో ఒకటి. కాకతీయుల కాలంలో ఈ కోటలో మహాదేవుని ఆలయానికి వచ్చి రాణి రుద్రమదేవి పూజలు చేశారు.
కామినేని వంశస్తులు మరమ్మతులు చేపట్టిన తర్వాత వారి రాజఠీవికి నిలువెత్తు నిదర్శనంగా మారింది దోమకొండ కోట.
ఆసియా-పసిఫిక్ కల్చరల్ కన్జర్వేషన్‌కు సంబంధించి యునెస్కో అవార్డు రావడంతో దోమకొండ కోట మరింత పర్యాటక శోభను సంతరించుకుంది.
దోమకొండ గ్రామంలో ఈ కోట పర్యటన కోసం కామినేని వంశస్తులు పర్యాటకలకు తగిన సహకారం అందిస్తున్నారు. మీరు కూడా ఈ కోటను ఓ సరి సందర్శించండి.
దోమకొండ, తెలంగాణలో కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి