అమ్మ కడుపులో ఉండగానే పిల్లలు నేర్చుకుంటారా..?
TV9 Telugu
04 August 2024
గర్భధారణ సమయంలో, స్త్రీలకు తమ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి రకరకాల ఊహించుకుంటారు.పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.
కడుపులో పెరుగుతున్న శిశువు కడుపు లోపల ఏమి చేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనే ఉంటుంది. శిశువు కూడా చాలా నేర్చుకుంటుంది.
గర్భిణీ స్త్రీలు వారి దినచర్య, ప్రవర్తన, ఇతర విషయాలపై కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. కడుపులో ఉన్న బిడ్డ తల్లి స్పర్శ, స్వరాన్ని గుర్తించగలదు.
ఆహారం, రుచి, స్వరం, మాట్లాడటం వంటి విషయాలను నేర్చుకునే పునాది తల్లి గర్భంలోనే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
గర్భిణీ స్త్రీల ఆహారం నుండి పోషకాహారం వారి పిల్లలకు కూడా చేరుతుంది. ఇది బిడ్డ పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
ఎలాగైనా బిడ్డ తల్లి అభిరుచికి అలవాటు పడతారు. తల్లికి ఉండే అలవాట్లు కొన్ని బిడ్డలకు కూడా సంక్రమిస్తాయి.
శిశువు కడుపులో పదవ వారం నుండి పోషకాలను తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఇది తల్లి రక్తం ద్వారా బిడ్డకు చేరుతుంది.
పదవ వారంలో శిశువుకు రుచి తెలుసుకోవడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వెల్లుల్లి రుచిని త్వరగా గుర్తిస్తారట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి