వీటితో ఇలా చేస్తే ఇంట్లో పరిమళం..
TV9 Telugu
04 August 2024
బేకింగ్ సోడా చెడు వాసనను గ్రహిస్తుంది. కాబట్టి చెడు వాసనను త్వరగా పోగొట్టుకోవడానికి ఇంట్లో ప్రతి మూలలో బేకింగ్ సోడా ఉంచటం మంచిది.
మీ అలంకరణ దిండ్లు, కర్టెన్లు, రగ్గు లేదా కార్పెట్‌లపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి కొన్ని గంటలపాటు అలాగే ఉంచండి. ఇది వాసనలను గ్రహిస్తుంది.
మీ ఇంటికి మంచి సువాసన వచ్చేలా చేయడానికి సులభమైన మార్గం ఏమిటంటే, అన్ని కిటికీలను కొద్దిసేపు తెరిచి ఉంచాలి. ఇది తక్షణమే మొత్తం గదిని శుభ్రపరుస్తుంది.
మీ ఇంటిని సువాసనగా ఉంచేందుకు ఇప్పుడు మార్కెట్‌లో అనేక సువాసనగల వస్తుసామాగ్రి ప్రతి మూలలో ఉంచండి. ఇది మీ ఇంటిని సువాసన భరితంగా ఉంచుతుంది.
రోజ్మేరీ, నిమ్మకాయ, పిప్పరమింట్, దాల్చిన చెక్క నారింజ వంటి నూనెలతో డిఫ్యూజర్‌ను ఉపయోగించండి. ఇది ఇంటిని నెలల తరబడి సువాసనగా ఉంచుతుంది.
ఇంట్లో సువాసనగల కొవ్వొత్తులు, అగరబత్తీలు, చందనం, అగరబత్తీలు వెలిగించండి. ఇది మీ ఇంటికి మంచి సువాసన రావడానికి సహాయపడుతుంది.
ఆరెంజ్ లేదా నిమ్మను ఒక గుండు సూదితో కాయ మొత్తం అక్కడక్కడ గుచ్చి వంటగదిలో ఉంచండి . అంతే ఇళ్ళంతా మంచి వాసనతో నిండిపోతుంది.
దాల్చిన చెక్క పొడి లేదా దాల్చిన చెక్కను కానీ ఇంట్లో కిటీకీల దగ్గర లేదా డోర్ దగ్గర ఉంచితే సహజమైన ప్రకృతి సిద్దమైన వాసన వెదజల్లుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి