అమ్మ కడుపులో ఉండగానే పిల్లలు నేర్చుకుంటారా..?
TV9 Telugu
04 August 2024
మనుషులు మొదట ఉపయోగించిన లోహం ఏది అని తెలుసా..? దీనిపైన నిపుణులు ఏమంటున్నారంటే.? అదేంటి అంటే.? తెలుసుకుందాం.
రాగి ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అని కూడా పిలుస్తారు. మానవులు లోహాలలో మొదటిగా రాగిని ఉపయోగించారు.
సుమారు 10,000 సంవత్సరాల క్రితమే మానవులు రాగిని చాలా రకాలుగా ఉపయోగించారని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
దాని ఉపయోగంతో మానవులు పురోగతి కొత్త దిశలో అడుగుపెట్టారు. మానవులు మొదట నదుల ఒడ్డున రాగిని కనుగొన్నారు.
పురాతన కాలంలో ఏదైన పని చేయడం కోసం పనిముట్లు, వేసుకొనే నగల తయారీకి రాగిని ఎక్కువగా ఉపయోగించారన్నది నిపుణుల మాట.
రాగి ప్రత్యేకత ఏమిటంటే దానిని సులభంగా కరిగించి అచ్చు వేయవచ్చు. అప్పట్లో కరెన్సీ కూడా రాగితోనే చేసేవారు.
అందువల్ల చరిత్రలో ఈ యుగాన్ని రాగి యుగం అంటారు. ఈ యుగంలో రాగి పనిముట్లు, ఆయుధాలు ఉపయోగించినట్లు చరిత్రకారులు భావిస్తుంటారు.
రాగి మెరిసే లోహం, ఇది ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది. సాగే గుణం ఉండే రాగిలో ఎరుపు నారింజ రంగుల మిశ్రమ కలిగి ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి