అందంగా కనిపించాలని ఆడవారికైనా, మగవారికైనా అందరికీ ఉంటుంది. ముఖ్యంగా పండుగల సమయంలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలనుకుంటారు. అయితే ఈ కోరిక మరింత ఎక్కువగా ఆడవారికి ఉంటుంది. వయసు పైబడుతున్నా యవ్వనంగా ఉండాలనుకుంటారు. ఇందు కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖరీదైన క్రీములు కూడా వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లి డబ్బులు ఎక్కువగా పెట్టి మరీ ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎంతో అందంగా తయారవ్వచ్చు. తక్కువ ఖర్చుతోనే అందంగా మెరిసిపోవచ్చు. ఈ విషయం తెలియక చాలా మంది డబ్బును వృథాగా ఖర్చు చేస్తున్నారు. ఇంట్లోనే కాస్త సమయం ఇస్తే ఫేషియల్ లుక్ మన సొంతం అవుతుంది. రాత్రి పడుకునే ముందు ఇవి రాసి పడుకుంటే ఉదయం వరకు మీ ముఖం మెరిసిపోతుంది.
చర్మ సమస్యలను దూరం చేసి.. ముఖ సౌందర్యాన్ని పెంచడంలో బాదం ఆయిల్ కూడా ఎంతో చక్కగా హల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాసి పడుకుంటే.. గ్లోతో పాటు చర్మ రంగు కూడా మెరుగు పడుతుంది.
పచ్చి పాలలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. పచ్చి పాలల్లో మనకు లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని క్లీన్ చేయడంలో ఎంతో చక్కగా సహాయ పడుతుంది. రాత్రి పడుకునే ముందు పచ్చి పాలలో కాటన్ ముంచి ముఖంపై అంతా అప్లై చేసుకుని పడుకోవాలి. ఓ గంట సేపు ఉంచి అయినా కడిగేసుకోవచ్చు. ఇలా తరచూ చేస్తే మీ ముఖంలో వచ్చే గ్లోని చూసి మీరే షాక్ అవుతారు.
కలబంద కూడా స్కిన్ సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు.. చర్మానికి తేమను అందించి.. కాంతివంతం చేస్తుంది. కొద్దిగా కలబంద రాత్రిపూట ముఖానికి రాసి అరగంట సేపు తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇలా చేస్తే.. మరి రిజల్ట్ ఉంటుంది.
అందరికీ అందుబాటులో దొరికే వాటిల్లో కొబ్బరి నూనె కూడా ఒకటి. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి, మంచి గ్లోని ఇస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని ముఖం, కాళ్లు, చేతులకు రాయండి. ఇలా తరచూ చేస్తే.. ఫేస్‌లో మంచి గ్లో వస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్, వెన్న, నెయ్యి వంటివి కూడా రాసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.