Eggs: గుడ్లను వీటితో కలిపి తింటే డేంజర్ బెల్స్ మోగినట్లే.. జాగ్రత్త!

|

Dec 24, 2024 | 2:31 PM

కోడి గుడ్లు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీర ఆరోగ్యానికి కావాల్సిన పదార్థాలు గుడ్లలో లభిస్తాయి. అయితే కొన్ని రకాల ఆహారాలతో కలిపి గుడ్లను తీసుకోకూడదు. దీని వల్ల అనేక ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటి? ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..

Eggs: గుడ్లను వీటితో కలిపి తింటే డేంజర్ బెల్స్ మోగినట్లే.. జాగ్రత్త!
Eggs
Follow us on

ఫుడ్ కాంబోస్ అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ జోలికి వెళ్లకుండా ఉంటేనే చాలా మంచిది. ఇలా పెద్ద లిస్టే ఉంది. ఇంతకు కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గుడ్డును కొన్ని రకాల ఆహారాలతో కలిపి అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. శరీర ఆరోగ్యానికి కావాల్సిన పదార్థాల్లో గుడ్లు కూడా ఒకటి. ప్రతి రోజూ ఉడక బెట్టిన గుడ్డు ఒక్కటి తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. శరీరాన్ని యాక్టీవ్‌గా ఉంచడంలో కూడా గుడ్లు హెల్ప్ చేస్తాయి. గుడ్లలో విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్, ఖనిజాలు లభిస్తాయి. పిల్లలకు పెట్టాల్సిన ముఖ్యమైన పోషకాల్లో గుడ్లు కూడా ఒకటి. గుడ్డును ఎలా తీసుకున్నా పోషకాలు అందుతాయి. కానీ కొన్ని రకాల ఆహారాలతో పాటు కలిపి తింటే సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూసేయండి.

టీ – ఎగ్:

ఎగ్స్‌తో ఎన్నో రకాల స్నాక్స్ తాయరు చేస్తూ ఉంటారు. దీంతో చాలా టీతో పాటు ఈ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తారు. కానీ టీతో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదని ముఖ్యంగా గుడ్డుతో చేసిన ఆహారాలు తింటే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. టీతో పాటు గుడ్లు తింటే శరీరంల ఐరన్‌ను శోషించుకోలేదు. జీర్ణ సమస్యల కూడా రావచ్చు.

సోయా మిల్క్ – గుడ్లు:

సోయా మిల్క్‌తో పాటు కూడా గుడ్లను తినకూడదు. సోయా మిల్క్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ గుడ్తో తింటే మాత్రం.. రెండింటిలో ఉండే ప్రోటీన్లు జీర్ణం అయ్యేందుకు సమస్య ఏర్పడుతుంది. పోషకాలు కూడా శరీరానికి సరిగా అందవు. గ్యాస్, అజీర్తి, మల బద్ధకం అనేక జీర్ణ సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

చేపలు – గుడ్లు:

సాధారణంగా ఇంట్లో అయినా బయట భోజనాల్లో అయినా చేపలతో పాటు గుడ్లను కూడా వడ్డిస్తూ ఉంటారు. ఇలా తినడం వల్ల అజీర్తి వంటి సమస్యలు రావచ్చు. దీని వల్ల అనేక జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

పాలు – గుడ్లు:

పాలు తాగిన వెంటనే కూడా గుడ్లు తినకూడదు. కనీసం ఓ అరగంట లేదా గంట సమయం అయినా తేడా ఉండాలి. దీని వల్ల కూడా ఎసిడిటీ, అజీర్తి, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే చక్కెరతో చేసిన తీపి వస్తువుల, విటమిన్ సీ ఫుడ్స్ తిన్న తర్వాత కూడా గుడ్లు తీసుకోకూడదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.