Kitchen Spices: ఈ నాలుగు మసాలాలు ఇంట్లో ఉంటే చాలు.. ఎన్నో వ్యాధులకు చెక్!

|

Oct 11, 2024 | 1:18 PM

త్వరలోనే చలికాలం ప్రారంభం కానుంది. మరోవైపు ఎండలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా సీజన్ మారే క్రమంలో ఖచ్చితంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కొందరిలో వైరల్ ఇన్ ఫెక్షన్స్ కూడా ఎటాక్ చేస్తాయి. ఇలా సీజన్ మారే క్రమంలోనే ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు జ్వరం, దగ్గు, జ్వరాలు వచ్చే వస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు..

Kitchen Spices: ఈ నాలుగు మసాలాలు ఇంట్లో ఉంటే చాలు.. ఎన్నో వ్యాధులకు చెక్!
Spices
Follow us on

త్వరలోనే చలికాలం ప్రారంభం కానుంది. మరోవైపు ఎండలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా సీజన్ మారే క్రమంలో ఖచ్చితంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కొందరిలో వైరల్ ఇన్ ఫెక్షన్స్ కూడా ఎటాక్ చేస్తాయి. ఇలా సీజన్ మారే క్రమంలోనే ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు జ్వరం, దగ్గు, జ్వరాలు వచ్చే వస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి. ఫ్రూట్స్, కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవాలి. వీటితో పాటు కిచెన్‌లో కూడా ఈ పదార్థాలను ఉంచుకోవాలి. ఈ నాలుగు మసాలాలు ఉంటే చాలు. ఎన్నో రకాల వ్యాధుల్ని రాకుండా చేసుకోవచ్చు. అంతేకాకుండా శరీరంలో కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

మిరియాలు:

మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పటిష్టం చేసేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఎటాక్ కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. మిరియాల పాలు, మిరియాల రసం తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.

దాల్చిన చెక్క:

మన వంటింట్లో లభించే వాటిల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్కతో అందం, ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇది ఎంతో అద్బుతమైన మసాలా ఔషధం. వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవడంలో ఇది ఎంతో బాగా పని చేస్ుతంది. ఇందులో పోలీఫఎనోల్స్, ప్రో ఏంతో సైనిడిన్ వంటివి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణగా నిలుస్తాయి.

ఇవి కూడా చదవండి

వాము:

ఆరోగ్యాన్ని పెంచడంలో వాము కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. జీర్ణ సమస్యలను నయం చేసి శరీరంలో రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పని చేస్తుంది. జలుబు, దగ్గు సమస్యలను గట్టెక్కించడంలో హెల్ప్ చేస్తుంది. వచ్చే చలి కాలంలో వాము నీరు తాగడం చాలా మంచిది.

అల్లం:

అల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అల్లాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి బయటు పడొచ్చు. అంతేకాకుండా శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంటుంది. అల్లం టీ తాగినా మంచిదే. వచ్చే చలికాలంలో అల్లం తీసుకుంటే రోగాలకు దూరంగా ఉండొచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..