Get Rid of Mosquitoes: నిమ్మకాయతో ఇలా చేస్తే ఇంట్లోకి అస్సలు దోమలే రావు..

|

Nov 26, 2024 | 7:38 PM

దోమలతో పెద్ద సమస్యే వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దోమలను కట్టడి చేయడం కష్టంగా మారుతుంది. దోమలు కుట్టడం వల్ల అనేక ఇతర సమస్యలు వస్తాయి. అందులోనూ చలి కాలంలో వీటి బెడద మరింత ఎక్కువగా ఉంటుంది..

Get Rid of Mosquitoes: నిమ్మకాయతో ఇలా చేస్తే ఇంట్లోకి అస్సలు దోమలే రావు..
Get Rid Of Mosquitoes
Follow us on

శీతాకాలంలో ఎక్కువగా ఉండే వాటిల్లో దోమలు కూడా ఒకటి. చలి కాలంలో ఎక్కువగా దోమల సమస్య ఉంటుంది. దోమల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ఎటాక్ చేయవచ్చు. దోమల కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం రాత్రి మాత్రమే కాకుండా.. పగలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది లిక్విడ్స్, కాయిన్స్, అగరవత్తులు వంటివి వాడుతూ ఉంటారు. ఈ పొగ పీల్చడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటే మరింత జాగ్రత్త అవసరం. కాబట్ట ఇంటి హోమ్ రెమిడీస్‌తో కూడా దోమల్ని ఇంట్లోంచి తరిమేయవచ్చు. దోమల నివారణకు ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలు తెలుసుకున్నాం. తాజాగా మీ కోసం మరిన్ని కొత్త చిట్కాలు తీసుకొచ్చాం.

వాము ఆకులు:

వాము ఆకులు చాలా మందికి తెలిసే ఉంటుంది. వాము ఆకులతో కూడా దోమల్ని ఈజీగా పోగొట్టవచ్చు. ఒక స్టీల్ లేదా గాజు గిన్నె లేదా పింగాణీ గిన్నెలో కొద్దిగా వాము ఆకులుత ీసుకోవాలి. ఈ ఆకులపై కొద్దిగా కర్పూరం చల్లి.. కాల్చాలి. ఇంట్లో నాలుగు వైపులకు తగిలేలా ఉంచి.. ఇంటి తలుపులు మూయాలి. ఇలా చేయడం వల్ల దోమలు ఇంట్లోంచి బయటకు పోతాయి.

వాము:

వాముతో కూడా దోమలు ఇంట్లోకి రాకుండా చేయవచ్చు. వాములో కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టాలి. ఇప్పుడు ఓ ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని ఓ బకెట్ నీటిలో వేసి కలిపి ఇంట్లో తడి బట్ట పెట్టాలి. ఈ వాసనకు ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. ఇలా కాకపోయినా.. ఈ నీటిలో స్ప్రే బాటిల్‌లో వేసి ఇంట్లో అంతా స్ప్రే చేసినా.. ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

కాఫీ పొడి:

కాపీ పొడితో దోమల్ని ఇంట్లోకి రానివ్వకుండా చేసుకోవచ్చు. కాఫీ గింజలు ఉంటే వాటిని పొడి చేసి.. తలుపు దగ్గర, మంచం కింద, కిటీకీల దగ్గర ఓ గిన్నెలో వేసి పెట్టాలి. మనకు షాపుల్లో లభించే కాఫీ పొడిని ఉంచినా పర్వాలేదు. ఈ వాసను దోమలు కుట్టకుండా ఉంటాయి.

నిమ్మకాయ:

నిమ్మకాయతో కూడా దోమల్ని చాలా ఈజీగా వదిలించవచ్చు. నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి.. లవంగాలను గుచ్చాలి. ఇప్పుడు దీన్ని మంచం కింద, మూలల్లో ఉంచితే దోమలు రాకుండా ఉంటాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..