Cleaning Tips: మాప్ పెట్టే నీటిలో వీటిని కలిపితే మురికి పోయి సువాసన వస్తుంది..

|

Oct 05, 2024 | 2:24 PM

ప్రస్తుత కాలంలో ఇంట్లో ఎక్కువగా టైల్స్ వేస్తున్నారు. వీటిని అస్తమానూ కడాగాల్సిన పని లేదు. పండుగల సమయంలో తప్పించి.. సాధారణంగా మాప్ పెడుతూ ఉంటారు. మాప్ పెట్టడం చాలా సులభం. అలాగే ఇల్లు కూడా క్లీన్ అవుతుంది. అయితే సాధారణంగా మాప్ పెట్టేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. మాప్ పెట్టేటప్పుడు.. నీటిని అస్సలు మార్చరు. ఒక బకెట్ నీటితోనే ఇంటిని అంతా పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మురికి, బ్యాక్టీరియా అనేవి పోవు. అంతే కాకుండా..

Cleaning Tips: మాప్ పెట్టే నీటిలో వీటిని కలిపితే మురికి పోయి సువాసన వస్తుంది..
Cleaning Tips
Follow us on

ప్రస్తుత కాలంలో ఇంట్లో ఎక్కువగా టైల్స్ వేస్తున్నారు. వీటిని అస్తమానూ కడాగాల్సిన పని లేదు. పండుగల సమయంలో తప్పించి.. సాధారణంగా మాప్ పెడుతూ ఉంటారు. మాప్ పెట్టడం చాలా సులభం. అలాగే ఇల్లు కూడా క్లీన్ అవుతుంది. అయితే సాధారణంగా మాప్ పెట్టేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. మాప్ పెట్టేటప్పుడు.. నీటిని అస్సలు మార్చరు. ఒక బకెట్ నీటితోనే ఇంటిని అంతా పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మురికి, బ్యాక్టీరియా అనేవి పోవు. అంతే కాకుండా ఫ్లోర్ కూడా తెల్లగా రాదు. కానీ మాప్ పెట్టేటప్పుడు కొన్ని రకాల చిట్కాలు ట్రై చేశారంటే.. ఖచ్చితంగా మీ ఇంటి ఫ్లోర్ తెల్లగా మారడమే కాకుండా.. బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మరి ఈ నీటిలో ఏం కలిపితే మంచిదో ఇప్పుడు చూద్దాం.

నీటిని మార్చండి:

మాప్ పెట్టేందుకు చాలా మంది నీటిని ఎక్కువగా ఉపయోగించరు. కేవలం బకెట్‌లో కొన్ని నీళ్లను మాత్రమే యూజ్ చేస్తారు. దీని వలన మురికి పెద్దగా పోదు. అలాగే ఫ్లోర్ పై బ్యాక్టీరియా, క్రిములు అలానే ఉంటాయి. నీళ్లను గమనిస్తూ మార్చుతూ ఉండాలి.

నిమ్మరసం:

మీరు మాప్ పెట్టడానికి ఉపయోగించే నీటిలో నిమ్మరసం పిండండి. నిమ్మరసం సహజ క్లీనింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే మైక్రోబయల్ లక్షణాలు బ్యాక్టీరియా, క్రిములు లేకుండా చేస్తుంది. మురికి కూడా త్వరగా పోతుంది. నిమ్మరసం పిండిన నీటితో తుడిస్తే సువానస కూడా వస్తుంది.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా బెస్ట్ కిచెన్ హ్యాక్ అని చెప్పొచ్చు. మాప్ పెట్టేటప్పుడు బేకింగ్ సోడా వేసి పెట్టడం వల్ల మీ ఫ్లోర్ ఎంతో తల్లగా మెరుస్తుంది. క్రిములు ఏమన్నా ఉన్నా పోతాయి. జిడ్డు, నూనె మరకలు త్వరగా పోతాయి.

వెనిగర్:

అన్ని రకాల ఫ్లోరింగ్స్‌కి కూడా వెనిగర్ ఉపయోగించవచ్చు. నీటిలో వేసి మాప్ పెట్టడం వల్ల ఫ్లోర్ ఎంతో శుభ్ర పడుతుంది. ఒక బకెట్ నీటిలో ఒక చిన్న కప్పు వెనిగర్ నీళ్లలో మిక్స్ చేసి క్లీన్ చేస్తే మీ ఫ్లోర్ మెరిసిపోతుంది. మంచి సువాసనతో పాటు క్రిములు కూడా పోతాయి.

ఎసెన్షియల్ ఆయిల్స్:

ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించడం వల్ల కూడా మీ ఫ్లోర్ శుభ్ర పడటమే కాకుండా మంచి సువాసన కూడా వస్తుంది. ఇందులో ఎలాంటి ఎసెన్షియల్ ఆయిల్ అయినా కలపొచ్చు. ఈ ఎసెన్షియల్ ఆయిల్‌తో పాటు కొద్దిగా సర్ఫ్ లేదా బేకింగ్ సోడా కలిపితే మంచి రిజల్స్ ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..