Kitchen Hacks: వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఇలా క్లీన్ చేస్తే.. ఆరోగ్యంగా ఉంటారు!

|

Jul 06, 2024 | 6:52 PM

వర్షా కాలం ప్రారంభమైంది. ఆరోగ్య పరంగా మరింత కేర్ తప్పకుండా తీసుకోవాలి. వర్షా కాలమే కదా.. చల్లగా ఉందని హాయిగా తిరిగితే త్వరగా జబ్బుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వర్షా కాలం అంటేనే జబ్బుల కాలం. ఈ సీజన్‌లో వాతావరణం తేమగా, వెచ్చగా ఉంటుంది. ఈ గాలి తేమలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మజీవులు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తినే ఆహారంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పండ్లను నేరుగా..

Kitchen Hacks: వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఇలా క్లీన్ చేస్తే.. ఆరోగ్యంగా ఉంటారు!
Kitchen Hacks
Follow us on

వర్షా కాలం ప్రారంభమైంది. ఆరోగ్య పరంగా మరింత కేర్ తప్పకుండా తీసుకోవాలి. వర్షా కాలమే కదా.. చల్లగా ఉందని హాయిగా తిరిగితే త్వరగా జబ్బుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వర్షా కాలం అంటేనే జబ్బుల కాలం. ఈ సీజన్‌లో వాతావరణం తేమగా, వెచ్చగా ఉంటుంది. ఈ గాలి తేమలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మజీవులు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తినే ఆహారంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పండ్లను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టకండి. అలాగే ఏవైనా సరే సరిగ్గా శుభ్రం చేయకుండా తినకండి. వర్షా కాలంలో ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిపై ఎక్కువగా బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు చేరే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలంలో కూరగాయలు, ఆకులు కూరలు, పండ్లను ఎలా శుభ్రం చేసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్యాప్ వాటర్‌తో శుభ్రం:

చాలా మంది మార్కెట్ నుంచి కూరగాయలను తీసుకొచ్చిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. ఇలా పెట్టడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు ఏమైనా ఉంటే ఇతర ఆహార పదార్థాల మీదకు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు ట్యాప్‌ వాటర్‌తో శుభ్రం చేసి తుడిచి పెట్టండి.

ఆకు కూరలు:

ఆకు కూరలను అయితే వండుకునే ముందు వేడి నీటిలో ఉప్పు, పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటికి కనిపించని బ్యాక్టీరియా, వైరస్‌లు కూడా నశిస్తాయి.

ఇవి కూడా చదవండి

పండ్లను తినే ముందు ఇలా క్లీన్ చేయండి:

చాలా మంది ఇప్పుడు పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటిపై ఎన్నో రకాల రసాయనాలు ఉండవచ్చు. కాబట్టి తెచ్చిన వెంటనే తినకుండా.. ఉప్పు నీరు లేదా బేకింగ్ సోడా వేసి నీటిలో ఓ పది నిమిషాలైనా ఉంచండి. మీరు తినాలి అనుకునే ముందు ఇలా చేస్తే సరిపోతుంది. కూరగాయలను కూడా శుభ్రం చేయవచ్చు.

వెనిగర్ సొల్యూషన్:

కూరగాయలు, పండ్లను ఈ పద్దతిలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ఒక పాత్రలోకి నీటిని తీసుకోండి. అందులోకి కొద్దిగా వెనిగర్ తీసుకోండి. వీటిలో పండ్లు, కూరగాయలను ఓ పావు గంట లేదంటే పది నిమిషాలు ఉన్నా పర్వాలేదు. ఇలా శుభ్రం చేయడం వల్ల వీటిపై ఉండే రసాయనాలు, బ్యాక్టీరియా, క్రిములు పోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..