KFC Chicken at Home: ఇంట్లోనే ఈజీగా కేఎఫ్‌సి చికెన్‌.. టేస్టే వేరే లెవల్ అంతే..

|

Jul 07, 2024 | 1:28 PM

కేఎఫ్‌సి చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఎంతో ఇష్ట పడి తింటూ ఉంటారు. దీని రుచి అలా ఉంటుంది మరి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అయితే బయట తినాలంటే వీటి ధర ఎక్కువే. ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి తినాలంటే.. బిల్ వేలల్లోనే వస్తుంది. అదే ఇంట్లోనే రూ.300ల కేజీ చికెన్‌తోనే అందరూ మనస్ఫూర్తిగా తినవచ్చు. అంతే కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి..

KFC Chicken at Home: ఇంట్లోనే ఈజీగా కేఎఫ్‌సి చికెన్‌.. టేస్టే వేరే లెవల్ అంతే..
Kfc Chicken 1
Follow us on

కేఎఫ్‌సి చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఎంతో ఇష్ట పడి తింటూ ఉంటారు. దీని రుచి అలా ఉంటుంది మరి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అయితే బయట తినాలంటే వీటి ధర ఎక్కువే. ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి తినాలంటే.. బిల్ వేలల్లోనే వస్తుంది. అదే ఇంట్లోనే రూ.300ల కేజీ చికెన్‌తోనే అందరూ మనస్ఫూర్తిగా తినవచ్చు. అంతే కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి.. ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అక్కడ వాళ్లు ఎలాంటి ఆయిల్స్, ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారో తెలీదు కదా. మరి ఇంకెందుకు లేట్ ఇంత టేస్టీ టేస్టీ కేఎఫ్‌సి చికెన్ ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

కేఎఫ్‌సి చికెన్‌కి కావాల్సిన పదార్థాలు:

చికెన్, గుడ్లు, మైదా పిండి, వెల్లుల్లి పొడి, పాలు, ఓట్స్, ఉప్పు, ఉల్లి పాయ పొడి, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, బ్రెడ్ పౌడర్, ఆయిల్.

కేఎఫ్‌సి చికెన్‌ తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని మీకు నచ్చిన విధంగా ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత వీటిల్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేయాలి. ఆ నెక్ట్స్ చికెన్ మంచి జ్యూసీగా, టేస్టీగా రావాలంటే.. శుభ్రం చేసిన చికెన్‌లో కొద్దిగా ఉప్పు వేసి ఓ గంట సేపు అయినా పక్కన పెట్టండి. ఆ తర్వాత వీటిని శుభ్రంగా టిష్యూ పేపర్‌తో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కారం, మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి అందులో చికెన్ ముక్కలు వేయాలి.

ఇవి కూడా చదవండి

చికెన్ ముక్కలు ఈ మిశ్రమం అంతా పట్టేలా కలపండి. ఇప్పుడు ఓ అరగంట సేపు పక్కన పెట్టండి. ఆ నెక్ట్స్ ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేయండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని అందులో గుడ్లు పగులకొట్టి బాగా గిలకొట్టాలి. ఇందులోనే పాలు వేయండి. ఇప్పుడు మరొక గిన్నెలో మైదా పిండి, వెల్లుల్లి పొడి, ఉల్లి పొడి, కారం, మిరియాల పొడి, ఓట్స్, ఉప్పు వేసి బాగా కలపండి. ఇందులోనే బ్రెడ్ పొడి కూడా వేయండి.

ఇప్పుడు చికెన్ ముక్కలను గుడ్లలో నుంచి తీసి ఆ తర్వాత బ్రెడ్‌ పొడిలో వేసి.. బాగా రూల్ చేసి మళ్లీ గుడ్లలో ముంచి.. వేడి అయిన ఆయిల్‌లో వేయాలి. ఇలా అన్నీ వేయాలి. ఆ తర్వాత రెండు వైపులా వేగాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని తినేయడమే. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.