కేవలం రూ.10 తో ఇంట్లోనే బొద్దింకలను ఇలా తరిమేయండి.. ఒక్కదెబ్బతో మళ్లీ మీ ఇంటివైపు రావు..

Updated on: Mar 24, 2026 | 4:51 PM

ప్రతి ఇంట్లోనూ మహిళలకు ఎదురయ్యే అతిపెద్ద సమస్యల్లో బొద్దింకల బెడద ఒకటి. ఇవి కేవలం అసహ్యంగా కనిపించడమే కాకుండా.. టైఫాయిడ్, కలరా, విరేచనాలు వంటి ప్రమాదకరమైన వ్యాధులను మోసుకొస్తాయి. మార్కెట్లో దొరికే రసాయన స్ప్రేలు కొట్టినప్పుడు కాసేపు బాగున్నా, వాటి ఘాటైన వాసన వల్ల ఇంట్లోని పిల్లలకు, వృద్ధులకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎటువంటి ఖర్చు లేకుండా, ఇంట్లోనే లభించే వస్తువులతో బొద్దింకలను శాశ్వతంగా ఎలా తరిమికొట్టాలో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

1 / 5
బొద్దింకలు ఎందుకు వస్తాయి: నివారణ గురించి తెలుసుకునే ముందు, అవి ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. వంటగది సింక్ కింద, బాత్రూమ్ పైపుల దగ్గర ఉండే తడి వీటికి ఇష్టమైన నివాసం. రాత్రిపూట కడగకుండా వదిలేసిన పాత్రలు, కింద పడిన చక్కెర లేదా అన్నం మెతుకులు వీటిని ఆకర్షిస్తాయి. పాత పేపర్లు, అట్టపెట్టెలు ఉన్న చోట ఇవి గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటాయి.

2 / 5
అరటిపండు తొక్కను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకుని 1 నుంచి 2 టీస్పూన్ల చక్కెర వేసుకోవాలి. అనంతరం 1-2 టీస్పూన్ల డిటర్జెంట్ కలుపుకోవాలి. ఇందులో అర కప్పు నీళ్లు పోసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా కాకుండా కాస్త పల్చగా ఉండాలి.

3 / 5
ఇంట్లోనే సహజ పదార్ధాలతో వీటిని సులువుగా నివారించవచ్చు. అందుకు ముందుగా 1-2 అరటిపండు తొక్కలు, చిన్న పాత్ర, 1-2 టీస్పూన్ల డిటర్జెంట్ (ద్రవ లేదా పొడి), 1-2 టీస్పూన్ల చక్కెర, అర కప్పు నీరు (సుమారు 100-120 మి.లీ) తీసుకోవాలి.

4 / 5
ఈ గిన్నెను ఇంటి మూలల్లో ఉంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రాత్రిపూట సింక్ కింద భాగంలో చీకటిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒకటి ఉంచండి. ఆహార వ్యర్థాలు ఉండే చోట బొద్దింకల సంచారం ఎక్కువ కాబట్టి అక్కడ తప్పనిసరిగా పెట్టాలి. బొద్దింకలు అరటిపండు, చక్కెర వాసనకు ఆకర్షితమై అవి గిన్నె దగ్గరకు వచ్చి ఆ నీటిని తాగుతాయి. డిటర్జెంట్ నీరు వాటి శరీరానికి తగలగానే, వాటి చర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల అవి శ్వాస తీసుకోలేక నిమిషాల వ్యవధిలోనే చనిపోతాయి.

5 / 5
మిశ్రమం ఉన్న గిన్నెను బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశంలో ఉంచాలి. వంటగది సింక్ కింద, అల్మరా మూలలో, ఫ్రిజ్ వెనుక, చెత్తబుట్ట దగ్గర, బాత్రూంలోఉంచవచ్చు. ఇందులోని పంచదార, అరటిపండు తొక్కల తీపి వాసన బొద్దింకలను ఆకర్షిస్తుంది. అవి ఈ మిశ్రమం వద్దకు వచ్చి అందులో పడిపోయి దానిని తాగుతాయి. ఇందులోని డిటర్జెంట్ వాటి శ్వాస మార్గాలను అడ్డుకుంటుంది. ఫలితంగా అవి త్వరగా చనిపోతాయి.

Follow Us