అలోవెరా మన చర్మం, జుట్టు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..అందుకే చర్మ సంరక్షణ, జుట్టు ఆరోగ్యానికి ఎంతోకాలంగా కలబంద జెల్‌ని ఉపయోగిస్తున్నారు. అలోవెరా జెల్ ను సరైన పద్ధతిలో ముఖానికి రాసుకుంటే మార్కెట్ లో లభించే ఖరీదైన క్రీములు, లోషన్లు వాడాల్సిన అవసరం ఉండదు. కలబందతో ఫేస్‌మాస్క్, హెయిర్ మాస్క్‌లు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారటంతో పాటు.. జుట్టు కూడా ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది.
చర్మ సంరక్షణలో అలోవెర్ జెల్ నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కలబంద జెల్‌తో ముఖానికి స్మూత్‌గా మసాజ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో ముఖానికి సహజ కాంతి వస్తుంది. దీని వల్ల ముఖం బ్రైట్‌గా మారుతుంది. అందంగా మారుతుంది. కలబందలో మన చర్మానికి పోషణను అందించడమే కాకుండా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది లోతైన గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.
ముఖ సౌందర్యం కోసం కలబందను నేరుగా ముఖానికి పట్టించవచ్చు లేదా గ్రీన్ టీలో కలిపి ఫేస్ మాస్క్ లా చేసి ముఖానికి అప్లై చేయవచ్చు. గ్రీన్ టీలో కలబందను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చర్మం మెరుపును రెట్టింపు చేస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ కలబందలో అర టీస్పూన్ గ్రీన్ టీ కలపండి. తర్వాత మీ ముఖంపై అప్లై చేయండి. కావాలనుకుంటే, ఈ మిశ్రమాన్ని రాత్రంతా ముఖానికి అలాగే వదిలేసిన కూడా ఎలాంటి భయం లేదు.
అలోవెరాతో టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. మెరిసే చర్మం కోసం, 1 టీస్పూన్ అలోవెరా జెల్‌లో 2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఈ ఫేస్ మాస్క్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలో మెరుపు పెరుగుతుంది.
అలోవెరా, తేనె మిక్స్ చేసి కూడా వాడుకోవచ్చు. తేనెలో చర్మానికి మేలు చేసే మంచి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ప్రత్యేక గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఇందుకోసం తేనెలో అలోవేరా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. సుమారు15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత శుభ్రమైన నీటితో క్లీన్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.