
అందమైన మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కొరుకుంటారు. ఇందుకోసం ఖరీదైన మేకప్ కిట్స్, రసాయనాలను వాడుతుంటారు. ఇలా బాగా ప్రజాధరణ పొందిన బ్యూటీ ప్రాడక్ట్స్‌లో విటమిన్ సి సీరం కూడా ఒకటి. ఇది చర్మాన్ని లోపలి నుండి బాగు చేయడమే కాకుండా, నిర్జీవత్వం, పిగ్మెంటేషన్, టానింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అనేక బ్రాండ్ల విటమిన్ సి సీరమ్‌లు అందుబాటులోకి ఉన్నాయి. కానీ ప్రస్తుతం కల్తీ వాడకాలు పెరిగిన నేపథ్యంలో వాటిన వాడడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి బయట దొరికే కెమికల్ సీరమ్స్ కాకుండా ఇంట్లో దీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
మిటమిన్ సి సీరమ్‌కు కావాల్సిన పదార్థాలు
అయితే ఈ సీరమ్‌ను ఇంట్లో తయారు చేసుకునేందుకు మీకు పెద్ద ఖరీదైన వస్తువు ఏం అవసరం లేదు. కేవలం నాలుగు సులభమైన పదార్థాలతో, మీ ముఖానికి బంగారు కాంతిని తీసుకురావడానికి సహాయపడే సహజమైన విటమిన్ సి సీరమ్‌ను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఇందుకు కోసం మీకు 1 టీస్పూన్ కలబంద జెల్, 1 విటమిన్ సి క్యాప్సూల్ లేదా 1 టీస్పూన్ నారింజ తొక్క పొడి ,1 టీస్పూన్ గులాబీ నీరు ,4-5 చుక్కల గ్లిజరిన్ ఉంటే సరిపోతుంది.
విటమిన్ సి సీరమ్ తయారీ విధానం
ఇంట్లోనే విటమిన్ సి సీరమ్ తయారు చేయడానికి ముందుగా ఒక శుభ్రమైన గిన్నె తీసుకోండి. అందులో తగినంత కలబంద జెల్ వేయండి. ఆపై ఒక విటమిన్ సి క్యాప్సూల్‌ను కట్ చేసి, అందులోని పొడిని ఆ జెల్‌లో బాగా కలపండి. ఒకవేళ మీ వద్ద క్యాప్సూల్స్ అందుబాటులో లేకపోతే, దానికి బదులుగా నారింజ తొక్కల పొడిని ఉపయోగించవచ్చు. ఆ తర్వాత, కొద్దిగా రోజ్ వాటర్, గ్లిజరిన్ కూడా వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇవన్నీ కలిసి చిక్కటి నునుపైన సీరమ్‌లా మారిన తర్వాత, దీన్ని ఒక చిన్న ఎయిర్-టైట్ సీసాలోకి మార్చుకోండి. అంతే, మీ ఇంట్లోనే సహజసిద్ధమైన విటమిన్ సి సీరమ్ రెడీ అయినట్టే.
దీనిని ఎలా ఉపయోగించాలి?
ఈ సీరమ్‌ను మీరు నిద్రపోయే ముందు, మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని. రెండు నుండి మూడు చుక్కల సీరమ్‌ను తీసుకుని, మీ ముఖం, మెడపై సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయండి.
విటమిన్ సి సీరం అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.