చామంతి పూలను సాధారణంగా మనం పూజ చేసేందుకు ఉపయోగిస్తాం. ముఖ్యంగా వీటిని లక్ష్మీ దేవి ఆరధనకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే పండుగల సందర్భంలో ఇంట్లో డెకరేషన్ చేయడానికి కూడా చామంతి పూలను వాడుతూంటారు. అందుకే చాలా మంది ఇంట్లోనే చామంతి పూల మొక్కలను పెంచుతూంటారు. అయితే చామంతి పూలనే కేవలం పూజకే ఉపయోగిస్తారనుకుంటే మీ పొరపాటే. చామంతి పూల మొక్కలతో దేవుని వరాలే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చామంతి పూలతో చర్మ సమస్యలే కాకుండా.. జ్వరం తగ్గడానికి, కీళ్ల నొప్పులు తగ్గడానికి, నిద్ర లేమి, ఒత్తిడి వంటివి తగ్గించుకోవచ్చు. చామంతి పూలతో మధు మేహాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి చామంతి పూలను ఏ విధంగా ఉపయోగిస్తే మనకు సత్ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులు కంట్రోల్:
కీళ్ల నొప్పులతో బాధ పడేవారు చామంతి పూలతో తయారు చేసిన టీ తాడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
జ్వరంతో బాధ పడేవారు:
ఫీవర్ వచ్చినప్పుడు రకరకాల మందులు వేసుకుంటాం. అలా కాకుండా చామంతి పూలతో తయారు చేసిన టీ తాగడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
ఎప్పుడైనా ఒత్తిడిగా, స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు.. చామంతి పూల టీతో తయారు చేసిన టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
నిద్ర లేమి సమస్యలు పరార్:
చాలా మంది నిద్ర లేమి సమస్యలతో బాధ పడుతున్నారు. అలాంటి వారు నిద్ర బాగా పట్టాలంటే.. వారికి చామంతి పూలతో తయారు చేసిన టీ బాగా ఉపయోగపడుతుంది. నిద్ర బాగా పట్టాలంటే.. ఫ్రిజ్ లో ఉంచి చామంతి పూలను కను రెప్పలపై ఉంచితే మంచి రిలీఫ్ దొరుకుతుంది.
చర్మం మెరుస్తుంది:
చామంతి పూలతో చేసిన టీని ఫేస్, కాళ్లు, చేతులపై రాసుకోవడం వల్ల స్కిన్ మెరుస్తూ ఉంటుంది. చర్మాన్ని శుభ్రం పరిచి, ఫ్రెష్ గా ఉంచేలా చేస్తుంది. దోమ కాటు వల్ల వచ్చే దద్దర్లు, మచ్చలు, గాయాల వల్ల వచ్చే మచ్చలు త్వరగా పోవాలంటే చామంతి పూల టీని వాటిపై రాస్తే పోతాయి.
తలనొప్పి నుంచి వెంటనే రిలీఫ్:
ఒక్కోసారి సడన్ గా తలనొప్పి అనేది వస్తూంటుంది. అలాంటప్పుడు చామంతి పూలను నేతిలో లైట్ గా వేయించి.. చల్లారనివ్వాలి. ఆ తర్వాత వాటిని నుదిపై పెట్టి కడితే తలనొప్పి నుంచి తక్షణమే రిలీఫ్ వస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.