
స్కై కిస్సింగ్ (Sky Kiss Technique): ఈ వ్యాయామం గడ్డం చుట్టూ ఉన్న కండరాలను స్ట్రెచ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ముందుగా మీ తలను వెనక్కి వంచి ఆకాశం వైపు చూడాలి. ఆ స్థితిలో ఉంటూ ఎవరికైనా ముద్దు (Kiss) పెడుతున్నట్లుగా మీ పెదవులను పైకి చాపాలి. ఇలా 10 నుండి 15 సెకన్ల పాటు ఉంచి, ఆపై సాధారణ స్థితికి రావాలి. దీన్ని రోజుకు 10 సార్లు చేయడం వల్ల గడ్డం కింద కొవ్వు కరుగుతుంది.

టంగ్ స్ట్రెచ్ (Tongue Stretch): నేరుగా కూర్చుని మీ నాలుకను వీలైనంత వరకు బయటకు చాచాలి. నాలుకను పైకి అంటే మీ ముక్కును తాకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పైకి తిప్పాలి. ఈ స్థితిలో 10 సెకన్లు ఉండి ఆ తర్వాత వదిలేయాలి. ఇది దవడ కండరాలను బలోపేతం చేస్తుంది.

దవడ కదలికలు (Jaw Jut): మీ తలను వెనక్కి వంచి సీలింగ్ వైపు చూడండి. ఇప్పుడు మీ కింది దవడను (Lower Jaw) వీలైనంత వరకు ముందుకు నెట్టాలి. దీనివల్ల గడ్డం కింద గట్టిగా సాగినట్లు (Stretch) అనిపిస్తుంది. ఈ పొజిషన్‌లో 10 లెక్కపెట్టి, ఆపై రిలాక్స్ అవ్వాలి.

చిన్ రోటేషన్ (Chin Rotation): నడుము తిన్నగా ఉంచి కూర్చోవాలి. మీ గడ్డాన్ని ఒక భుజం నుండి మరొక భుజం వైపు మెల్లగా గుండ్రంగా (Semi-circle) తిప్పాలి. ఇలా చేయడం వల్ల మెడ, దవడ భాగంలోని కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది.

ఫేస్ ఎక్సర్‌సైజెస్ చేయడంతో పాటు రోజూ తగినంత నీరు తాగడం వల్ల ముఖంలో వాపు (Water retention) తగ్గుతుంది. అలాగే, తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీర బరువుతో పాటు ముఖంలోని అదనపు కొవ్వు కూడా సహజంగానే కరిగిపోతుంది. రోజూ ఉదయం లేదా సాయంత్రం ఈ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ కొద్ది రోజుల్లోనే పర్ఫెక్ట్ జా లైన్‌ను మీ సొంతం చేసుకోండి!