Chicken Curry Recipe: నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!

Village Style Chicken Curry Recipe: చికెన్ కర్రీ కోసం మసాలాలు నూరాల్సిన అవసరం లేకుండా, కుక్కర్‌లోనే ఎంతో సులభంగా తయారుచేసుకునే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ ఇది. బ్యాచిలర్స్, కొత్తగా వంటలు నేర్చుకునేవారు కూడా ఈజీగా చేసేయవచ్చు. పల్లెటూరి రుచితో ఘుమఘుమలాడే ఈ కర్రీ వేడివేడి అన్నం, రోటీ, చపాతీలతో అద్భుతంగా ఉంటుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Chicken Curry Recipe: నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
Village Style Chicken Curry Recipe

Updated on: Jun 02, 2026 | 12:21 PM

చికెన్ కర్రీ చేయాలంటేనే రకరకాల మసాలాలు నూరడం, మిక్సీ తిప్పడం.. ఇలా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని అందరూ భావిస్తారు. కానీ ఎలాంటి గ్రైండింగ్ పనులు లేకుండానే, కుక్కర్‌లో ఎంతో రుచికరంగా..చాలా ఈజీగా విలేజ్ స్టైల్‌లో చికెన్ కర్రీని తయారుచేయవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్, కొత్తగా వంటలు చేస్తున్న వారు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ చికెన్ రెసిపీ రుచిలో మాత్రం అదిరిపోతుంది అంతే.. వేడివేడి అన్నం, రోటీ లేదా చపాతీలతో ఈ కర్రీ అద్భుతంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు

చికెన్ – ½ కేజీ
నూనె – 3 టేబుల్ స్పూన్లు
హోల్ గరం మసాలా దినుసులు – తగినంత
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు – 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పసుపు – ¼ టీస్పూన్
కారం – రుచికి సరిపడా
ఉప్పు – తగినంత
ధనియాల పొడి – 1 టీస్పూన్
గరం మసాలా – ½ టీస్పూన్
కరివేపాకు – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
నీరు – అవసరమైనంత

తయారీ విధానం

  • ముందుగా చికెన్ ముక్కలను బాగా కడిగి, అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేసి వేడయ్యాక గరం మసాలా దినుసులు వేయాలి. వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి.
  • ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు వేయించాలి.
  • ఇప్పుడు చికెన్ ముక్కలను వేసి హై ఫ్లేమ్‌పై మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
  • మంటను తక్కువ చేసి ఐదు నిమిషాల పాటు చికెన్‌ను మగ్గనివ్వాలి. దీంతో మసాలా రుచులు చికెన్‌లోకి బాగా పడతాయి.
  • తర్వాత గ్రేవీకి అవసరమైనంత నీరు పోసి కుక్కర్ మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  • అంతే… ఘుమఘుమలాడే, నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ! తిన్నాక ఎవరైనా వావ్ అనాల్సిందే..

ఈ విలేజ్ స్టైల్‌ చికెన్ కర్రీ తయారు చేయడానికి మిక్సీ తిప్పే పని ఉండదు కాబట్టి సమయం చాలా ఆదా అవుతుంది. వేడివేడి అన్నంలోకి గానీ, రోటీ లేదా చపాతీల్లోకి గానీ ఈ కర్రీ అద్భుతమైన కాంబినేషన్!

Follow Us