Sankranti 2024 Recipe: టేస్ట్‌తో పాటు ఆరోగ్యం కూడా కావాలా.. ఈ బజ్జీ తినండి!

| Edited By: Ravi Kiran

Jan 15, 2024 | 1:00 PM

బజ్జీలు అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. వర్షాకాలం, శీతా కాలం వచ్చిందంటే అందరూ బజ్జీల బండ్ల దగ్గరే ఉంటారు. అలా చల్లని వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తింటే అబ్బా.. ఆ ఊహే.. రుచే వేరు కదా. అయితే ఈ బజ్జీల వల్ల ఒక్కోసారి గ్యాస్ ఎక్కువగా వస్తుంది. దీంతో చాలా సతమతమవుతూ ఉంటారు. కానీ బజ్జీలతో పాటు ఆరోగ్యం కూడా కావాలంటే.. ఆంధ్రా స్టైల్ తమలపాకు బజ్జీలు ట్రై చేయండి. తమల పాకుతో వేసే ఈ బజ్జీలు ఆంధ్రాలో చాలా స్పెషల్ అండ్ ఫేమస్ కూడా. అదే విధంగా ఎంతో రుచిగా..

Sankranti 2024 Recipe: టేస్ట్‌తో పాటు ఆరోగ్యం కూడా కావాలా.. ఈ బజ్జీ తినండి!
Tamalapaku Bajji
Follow us on

బజ్జీలు అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. వర్షాకాలం, శీతా కాలం వచ్చిందంటే అందరూ బజ్జీల బండ్ల దగ్గరే ఉంటారు. అలా చల్లని వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తింటే అబ్బా.. ఆ ఊహే.. రుచే వేరు కదా. అయితే ఈ బజ్జీల వల్ల ఒక్కోసారి గ్యాస్ ఎక్కువగా వస్తుంది. దీంతో చాలా సతమతమవుతూ ఉంటారు. కానీ బజ్జీలతో పాటు ఆరోగ్యం కూడా కావాలంటే.. ఆంధ్రా స్టైల్ తమలపాకు బజ్జీలు ట్రై చేయండి.

తమల పాకుతో వేసే ఈ బజ్జీలు ఆంధ్రాలో చాలా స్పెషల్ అండ్ ఫేమస్ కూడా. అదే విధంగా ఎంతో రుచిగా కూడా ఉంటాయి. వీటిని ఈజీగా ఇంట్లోనే వేసుకుని అందరూ తక్కువ ఖర్చుతో బజ్జీలు తినొచ్చు. కొత్తదనంగా కూడా ఉంటుంది. పండుగ సమయాల్లో, వీకెండ్స్, స్పెషల్‌ డేస్‌లో ఇలా బజ్జీలు వేసుకుని తింటే.. చాలా బావుంటుంది. మరి ఈ తమలపాకు బజ్జీలు ఎలా చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

తమలపాకు బజ్జీలకు కావాల్సిన పదార్థాలు:

తమల పాకులు, చనగ పిండి, సాల్ట్, వాము, కారం, కొద్దిగా వంట సోడా, ఆయిల్, చాట్ మసాలా, ఉల్లి పాయలు, నిమ్మ కాయ.

ఇవి కూడా చదవండి

తమలపాకు బజ్జీలు తయారీ విధానం:

ముందుగా తమల పాకులను శుభ్రం కడిగి ఆరబెట్టాలి. ఇప్పుడు లోతుగా ఉండే పాత్ర తీసుకుని అందులో ముందుగా చనగ పిండి, సాల్ట్, వాము, కారం, కొద్దిగా వంట సోడా, ఆయిల్, చాట్ మసాలా వేసి బజ్జీల పిండిలా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టి.. ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేయాలి.

ఆయిల్ వేడెక్కాక.. ముందుగా పక్కన పెట్టిన తమల పాకులు తీసుకుని.. ఒక్కొటి.. పిండిలో ముంచి నూనెలో వేయాలి. ఇప్పుడు మీడియం మంట మీద పెట్టి.. రెండు వైపులా బజ్జీలను ఎర్రగా వేయించాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలు సిద్ధం. వీటిని మధ్యలో కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు పెట్టి, చాట్ మసాలా వేసి.. నిమ్మ కాయ రసం పిండుకుని తింటే.. వావ్ అనాల్సిందే. అంత రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ఇంకెందుకు లేట్ ఈ సారి మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకు ట్రై చేయండి.