మటన్ మస్తుందని లాగించేస్తున్నారా.. ఈ నిజాలు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు

మటన్ రుచికరమైనప్పటికీ, దానిని తిన్న వెంటనే తేనె, పాలు, పాల పదార్థాలు, టీ వంటివి తీసుకోకూడదు. అలాగే, మటన్ తిన్నాక వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ఈ నియమాలు పాటించకపోతే చర్మ అలెర్జీలు, కడుపులో యాసిడ్స్ పెరిగి తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

మటన్ మస్తుందని లాగించేస్తున్నారా.. ఈ నిజాలు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు
Mutton

Updated on: Mar 31, 2026 | 12:30 PM

నాన్ వెజ్ ప్రియులు.. చాలామంది మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. మటన్ (మేక మాంసం) రుచి అమోఘంగా ఉండటమే కాకుండా, శరీరానికి అపారమైన బలాన్ని, ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది. మటన్ విటమిన్ B12 గొప్ప మూలం.. ఇది ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే..మటన్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానిని తినేటప్పుడు, తిన్న తర్వాత కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం చాలా అవసరం. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు డైటీషియన్లు..

మటన్ తిన్న వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తినడం లేదా కొన్ని రకాల పానీయాలు సేవించడం చాలా ప్రమాదకరం. వాటిలో ప్రధానంగా తేనె, పాలు, పాల ఉత్పత్తులు, టీ ఉన్నాయి. మటన్ తిన్న తర్వాత తేనె తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని రసాయన చర్యలు జరిగి, జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేవిధంగా, పాలు, పాల ఉత్పత్తులు మటన్‌తో కలిసి జీర్ణమవడం కష్టమవుతుంది. ఇది చర్మ అలెర్జీలు, కడుపులో యాసిడ్స్ పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాలలో, ఈ కలయికలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు, ప్రాణాపాయానికి కూడా కారణం కావచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.

మటన్ తిన్న తర్వాత టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. టీలో ఉండే కెఫిన్, టానిన్లు మటన్‌లోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా, జీర్ణవ్యవస్థపై అదనపు భారాన్ని పెంచి, కడుపులో అసౌకర్యానికి దారితీస్తుంది. ఈ మూడు పదార్థాలను మటన్ తినడానికి ముందు లేదా తర్వాత వెంటనే తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం.

మరొక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, మటన్ తిన్న వెంటనే నిద్రపోకూడదు. నాన్-వెజ్ ఆహారాలు, ముఖ్యంగా మటన్, జీర్ణం కావడానికి సాధారణ ఆహారాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. ఇది పొట్ట ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట, వాంతులు వంటి సమస్యలకు దారితీస్తుంది.

జీర్ణవ్యవస్థ సరిగా పని చేయకపోవడం వల్ల కడుపులో రకరకాల యాసిడ్స్ పెరిగి, లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మటన్ లేదా ఏదైనా నాన్-వెజ్ ఆహారం తిన్న తర్వాత కొంత సమయం పాటు అటూ ఇటూ తిరగడం లేదా ఏదైనా తేలికపాటి పని చేసుకోవడం మంచిది. దీనివల్ల జీర్ణక్రియ సజావుగా జరిగి, ఆహారం శరీరం సులభంగా గ్రహిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఈ ఆహార నియమాలను పాటించడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us