త్వరగా ఆకలి వేయదు.. శరీరానికి ఉక్కులాంటి బలం.. అన్నం బదులు ఈ రొట్టెలు తినండి..

జొన్న రొట్టెల్లో పీచు పదార్థం, పలు ఖనిజాలు ఉండటంతో ఇవి సమతుల ఆహారంలో మంచి భాగంగా నిలుస్తాయి. గ్లూటెన్ రహిత ఆహారం కోరుకునేవారికి జొన్నలు ఉపయోగకరమైన ప్రత్యామ్నాయం. బరువు నియంత్రణ, జీర్ణక్రియకు తోడ్పడతాయి.. అంతేకాకుండా.. పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసి.. శరీరానికి శక్తినిస్తాయి..

త్వరగా ఆకలి వేయదు.. శరీరానికి ఉక్కులాంటి బలం.. అన్నం బదులు ఈ రొట్టెలు తినండి..
Jowar Roti Benefits

Updated on: Oct 22, 2026 | 12:12 PM

రోజూవారీ ఆహారంలో గోధుమ రొట్టెలకు బదులుగా చాలామంది జొన్న రొట్టెలను ఎంచుకుంటున్నారు. వాస్తవానికి గోధుమలు, జొన్నలు పవర్‌ఫుల్ ఆహారమే.. కానీ.. గోధుమలతో పోలిస్తే.. జొన్నలు ఇంకాస్త బెటర్ ఫుడ్ అని పేర్కొంటున్నారు. గ్లూటెన్ రహిత (Gluten-free) ఆహారం కోరుకునే వారికి ఇవి అత్య ఉత్తమ ఎంపిక.. జొన్నల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జొన్న రొట్టెలు తినడం వల్ల కలిగే ప్రధాన లాభాలేంటో తెలుసుకోండి..

పోషకాల ఖజానా:

జొన్నల్లో కాల్షియం, ఐరన్, భాస్వరం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి రోజూవారీ శక్తిని అందించడంతో పాటు, హానికారక టాక్సిన్స్‌ను బయటికి పంపిస్తాయి.

మెరుగైన జీర్ణవ్యవస్థ: ఇందులో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమై జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

బరువు నియంత్రణ: జొన్న రొట్టెలు తినడం ద్వారా కడుపు నిండిన భావన కలుగుతుంది.. దీంతో త్వరగా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో సహాయపడుతుంది.

ఎముకలకు బలం: కాల్షియం, పాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. వయసుతో పాటు వచ్చే కీళ్ల నొప్పుల ముప్పు తగ్గుతుంది.

గుండె ఆరోగ్యం – షుగర్ కంట్రోల్: పొటాషియం రక్తపోటును (Blood Pressure) క్రమబద్ధీకరించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే, రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నెమ్మదిగా విడుదల అయ్యేలా చేయడంలో ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.

రక్తహీనత నివారణ: తగినంత ఐరన్ అందడం ద్వారా హిమోగ్లోబిన్ శాతం మెరుగై, రక్తహీనత (Anemia), నీరసానికి చెక్ పెట్టవచ్చు.

అందుకే.. రెగ్యులర్‌గా జొన్న రొట్టెలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్నం బదులు వీటిని తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. జొన్న రొట్టెలు తీసుకోని వారు.. కనీసం జొన్న జావ అయినా తాగొచ్చని పేర్కొంటున్నారు.

అయితే.. జొన్నలు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us