Vellulli Karam Kodi Vepudu: వెల్లుల్లి కారం కోడి వేపుడు ఒక్క సారి రుచి చూశారంటే.. మర్చిపోరు!

| Edited By: Ram Naramaneni

Nov 17, 2024 | 9:27 PM

చికెన్‌తో ఎన్నో రకాల వేపుళ్లు, కర్రీలు, ఫ్రైలు తినే ఉంటారు. చికెన్‌తో ఏది చేసినా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వేపుళ్లు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఇలా వేపుళ్లలో ఈ వెల్లుల్లి కారం వేసి చేస్తే అదుర్స్.. మరి ఇది ఎలా చేస్తారో చూసేయండి..

Vellulli Karam Kodi Vepudu: వెల్లుల్లి కారం కోడి వేపుడు ఒక్క సారి రుచి చూశారంటే.. మర్చిపోరు!
Vellulli Karam Kodi Vepudu
Follow us on

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంతో ప్రాణం. చికెన్‌ని ఎలా తయారు చేసినా చాలా రుచిగా ఉంటుంది. చికెన్‌తో కొన్ని వేల రెసిపీలు తయారు చేయవచ్చు. ఇప్పటికే ఎన్నో రకాల రెసిపీలు తెలుసుకున్నాం. చికెన్‌తో తయారు చేసే స్నాక్స్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. చికెన్‌తో ఎన్నో రకరకాల వంటలను రుచి చూసే ఉంటారు. చికెన్‌తో ఎక్కువగా వేపుళ్లు తయారు చేస్తూ ఉంటారు. ఇలా చికెన్‌ వేపుళ్లలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వాటిల్లో ఈ వెల్లుల్లి కారం కోడి వేపుడు కూడా ఒకటి. ఇది స్పైసీగా, ముక్క సాఫ్ట్‌గా చాలా బాగుంటుంది. స్పైసీ కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయవచ్చు. చేయడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. మరి ఈ వెల్లుల్లి కారం కోడి వేపుడుకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి కారం కోడి వేపుడుకి కావాల్సిన పదార్థాలు:

కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, చికెన్, కరివేపాకు, టమాటా, ఆయిల్, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, మిరియాలు.

వెల్లుల్లి కారం కోడి వేపుడు తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక.. చికెన్ వేసి ఓ పది నిమిషాలు ఆయిల్‌లోనే ఫ్రై చేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఓ ఐదు నిమిషాలు వేయించాక.. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు మీడియం మంట మీద ఉడికించండి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు కొద్దిగా వేసి కలపండి. ఇది వేగుతుండగా.. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో.. వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, మిరియాలు, కారం వేసి మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టండి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ పొడిని మీ ఘాటుకు సరిపడినంతగా వేసుకోండి. ఆ తర్వాత చిన్న మంట మీద ఒక స్పూన్ నెయ్యి వేసి చక్కగా వేగించండి. ఓ పది నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి దింపేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం కోడి వేపుడు సిద్ధం. ఈ ఫ్రైని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా, బిర్యానీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.