చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌తో ఎన్నో వేల రెసిపీలు తయారు చేయవచ్చు. చికెన్‌కి సపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. చికెన్‌తో స్నాక్స్, కూరలు, వేపుళ్లు, రైస్ ఐటెమ్స్ ఎలా చేసిన చికెన్ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కడైనా నాన్ వెజ్ స్టార్ట్ చేయాలంటే చికెన్‌తోనే చేస్తారు. ఇలా చికెన్‌తో చేసే వాటిల్ల మిరియాల పొడి వేపుడు కూడా ఒకటి. దీన్నే పెప్పర్ చికెన్ ఫ్రై అని రెస్టారెంట్లలో సేల్ చేస్తూ ఉంటారు. ఇది సైడ్‌డిష్‌గా బెస్ట్ అని చెప్పొచ్చు. రసం లేదా సాంబార్ చేసుకుని సైడ్ డిష్‌గా ఇది చేసుకుని తింటే ఆహా ఆ రుచే వారు. మరి ఈ పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చికెన్, మిరియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం, నెయ్యి, ఆవాలు, నిమ్మరసం, కరివేపాకు, కొత్తిమీర, దాల్చిన చెక్క, జీలకర్ర, సోంపు, మరాఠీ మొగ్గ, ధనియాలు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, ఆయిల్.
ముందు చికెన్‌ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో దాల్చిన చెక్క, జీలకర్ర, సోంపు, మరాఠీ మొగ్గ, ధనియాలు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు వేసి వేయించి పొడి కొట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి వెల్లుల్లి ముక్కలు, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కాస్త రంగు మారాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేయాలి.
అలాగే కొద్దిగా ఉప్పు వేయాలి. నీరంతా దిగాక కారం, పసుపు, ముందుగా ఫ్రై చేసిన పొడి వేసి చిన్న మంట మీద ఫ్రై చేయాలి. ఇలా దగ్గరగా చిన్న మంట మీద కలుపుతూ ఉండగా.. ఆయిల్ అంతా పైకి తేలి.. మంచి సువాసన వస్తుంది. అంటే చికెన్ రెడీ అయినట్టే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం పిండాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది. గ్రేవీలా కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసి చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది.