Gongura Royyala Pickle: గోంగూర రొయ్యల పచ్చడి ఇలా చేశారంటే.. అదుర్సే ఇక!

| Edited By: Ram Naramaneni

Nov 17, 2024 | 9:30 PM

గోంగూర రొయ్యల కాంబినేషన్ కర్రీ చాలా ఫేమస్. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి ఈ కాంబినేషన్‌లో నిల్వ పచ్చడి పెడితే ఇక అదుర్సే. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే ఆహా ఇక చెప్పాల్సిన పని లేదు. మరి ఈ నిల్వ పచ్చడి ఎలా చేస్తారో మీరే చూడండి..

Gongura Royyala Pickle: గోంగూర రొయ్యల పచ్చడి ఇలా చేశారంటే.. అదుర్సే ఇక!
Gongura Royyala Pickle
Follow us on

ఈ మధ్య కాలంలో సాధారణ వెజ్ పికిల్స్ కంటే.. నాన్ వెజ్ పికిల్స్ తినడానికే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా నాన్ వెజ్ పికిల్స్‌లో ఎక్కువగా అందరూ తినే వాటిల్లో రొయ్యలు ఒకటి. సాధారణంగా రొయ్యల పచ్చడి పెడతారు. కానీ గోంగూర కలిపి పెడితే.. ఆహా ఆ రుచే వేరు. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తింటే అబ్బో.. చెబుతుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. బయట కొనే బదులు మనం కూడా ఇంట్లో సింపుల్‌గా పచ్చడి పెట్టుకోవచ్చు. మరి ఈ గోంగూర రొయ్యల పచ్చడి ఎలా పెడతారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోంగూర రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

రొయ్యలు, గోంగూర, ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లవెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్, ఉప్పు.

గోంగూర రొయ్యల పచ్చడి తయారీ విధానం:

ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. రొయ్యలు పెద్దగా ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత గోంగూరను కూడా శుభ్రంగా కడిగి నీరంతా పిండి పక్కన పెట్టండి. ఈ పచ్చడిలో కారానికి బదులు ఎండు మిర్చి ఉపయోగిస్తున్నారు. కాబట్టి వీటినే ఎక్కువగా తీసుకోండి. వీటిని దోరగా వేయించి.. చల్లార్చి పొడిలా చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి.. వేడి చేయాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. నెక్ట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఆ తర్వాత నీరంతా పోయిన గోంగూరా వేసి వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టిన రొయ్యలు, ఉప్పు, పసుపు కూడా వేసి కలుపుతూ ఉండాలి. నెక్ట్స్ కొద్దిగా నీళ్లు వేసి ఇవన్నీ మగ్గేవరకు ఉంచి నీరంతా ఆవిరి అయిపోయాక.. ఎండు మిర్చి పొడి వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇలా చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ప్లాస్టిక్ కంటైనర్స్ కంటే గాజు పాత్రలో ఉంచితే పచ్చడి పాడవకుండా ఉంటుంది.